Begin typing your search above and press return to search.
విడాకులకు అనేకం అంటున్న స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 26 Jan 2022 5:30 AM GMTభార్యాభర్తల మధ్య విడాకులకు కారణాలు అనేకం. ప్రధానంగా తెరపైకి వచ్చేది ఆలు మగల మద్య మనస్ఫర్ధలు తలెత్తడం. అందుకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. అయితే ప్రధానంగా స్త్రీ-పురుషుల మధ్య శారీరక సాన్నిహిత్యం అన్నది ఎంతో ముఖ్యంగా హైలైట్ అవుతుంది. చాలామంది ఈ రకంగానే అభిప్రాయపడుతుంటారు. అయితే అసలు కారణం అది కాదని తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణే అభిప్రాయపడింది. శారీరక సాన్నిహిత్యం కంటే బలమైన కారణాలు చాలానే ఉన్నాయని విశ్లేషించారు. నమ్మకం..స్నేహం వంటి విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ముఖ్యంగా విడాకులకు సంబంధించి అనేక సందర్భాల్లో దంపతుల మధ్య సంతృప్తికరమైన శారీరక సాన్నిహిత్యం లేకపోవడమన్నది ప్రధాన కారణలలో ఒకటి కావొచ్చు. కానీ అనేక ఇతర కారణాలు కూడా వివాహ బంధాన్ని వీగిపోయేలా చేస్తున్నాయి. వాటిపై పూర్తి అవగాహన.. పరిపక్వత తెచ్చుకోవాల్సిన బాధ్యత.. అవసరం ఎంతైనా ఉందని దీపిక అన్నారు. ఇటీవలి కాలంలో భార్య భర్తల మధ్య బంధాలు మరింత బలహీనంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. అదీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. ఏడాది కూడా గడవకుండానే విడిపోవడం పరిపాటిగా మారింది.
నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత ధనుష్-ఐశ్యర్య విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి చెబుతూ ధనుష్ దంపతులు అభిమానులకు షాక్ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ లో అమీర్ ఖాన్-కిరణ్ రావు కూడా విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అమీర్ కి అంతకు ముందు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజాగా మరోసారి కిరణ్ రావుకి దూరమవ్వడంతో సెలబ్రిటీల పాలిట పెళ్లిళ్లు అంటే పూర్తిగా నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.