Begin typing your search above and press return to search.
మీటూలో మీరు రారా!!
By: Tupaki Desk | 22 Oct 2018 7:47 AM GMTఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేస్తున్న మీటూ తాలూకు సెగలు ఇంకా పాకుతూనే ఉన్నాయి. తామంటే తామని బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. హీరోలు సంగీత దర్శకులు రచయితలు డైరెక్టర్లు ఒకరేమిటి అందరిని వీధుల్లోకి లాగుతున్నారు. తప్పు చేసిన కొందరు ఒప్పుకుని సినిమాల నుంచి తప్పుకోవడం షోల నుంచి బయటికి రావడం చేస్తున్నారు. మరికొందరు చట్టప్రకారం ముందుకు వెళ్తామంటూ లీగల్ నోటీసులతో సిద్ధమవుతున్నారు.
కానీ ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణల పర్వాన్ని గమనిస్తే కేవలం ఎప్పుడో కనుమరుగైపోయిన మాజీ హీరోయిన్లు డబ్బింగ్ ఆర్టిస్టులు సింగర్లు తప్ప ఫామ్ లో ఉన్నవాళ్ళెవరూ గొంతు విప్పలేదు. కొంతలో కొంత కంగనా రౌనత్ తో పాటు రాధికా ఆప్టే దీని గురించి మాట్లాడారు. మిగిలిన వారి సంగతి మాత్రం గప్ చుప్ అన్నట్టుగా ఉంది. ఇక్కడో విషయం స్పష్టం. లైమ్ లైట్ లో ఉంటూ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్న వాళ్లెవరు మీటూ ఉద్యమంలో భాగం వహించేందుకు సిద్ధంగా లేరు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని కొందరు ఇప్పుడు చెబితే కక్ష సాధింపు చర్యలు ఉంటాయని మరికొందరు ఇలా ఎవరికి అనుకూలంగా ఉండే కారణాలతో సైలెంట్ గా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మీటూ చైతన్యాన్ని బలహీనపరుస్తోది ఈ అంశమే. అంటే పరిశ్రమలో అన్ని చూసేసాక ఇక చేయడానికి ఏమి లేదు అనుకున్నవాళ్ళే మీటూ అంటూ రచ్చ చేస్తున్నారు అనే కామెంట్స్ లో నిజం లేకపోలేదు.
అలా అని దీన్ని కించపరచడం కాదు. ముందు ముందు ఎవరూ బాధితులుగా మారకూడదు అనుకుంటే ఇప్పుడు ఎంత ఫామ్ లో ఉన్నా సరే ఇలాంటి వేధింపులకు గురైన వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు ముందుకు వస్తే అది సరికొత్త మార్పుకు నాంది పలుకుతుంది. అంతే కానీ ఎప్పుడో 1990లో ఓ ఆర్టిస్టు వేధించాడు 2000లో ఒక దర్శకుడు గదికి రమ్మన్నాడు అంటే కనీసం ఋజువు చేయడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే మీటూ ఈ దిశగా కూడా తన దారి మార్చుకుంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. మరి ఇది జరిగే సూచనలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు.