Begin typing your search above and press return to search.

ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి

By:  Tupaki Desk   |   27 Jun 2018 1:30 AM GMT
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి
X
సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే సుదీర్ఘ కాలం కెరీర్ కంటిన్యూ చేస్తుంటారు. చాలామంది ఫేమ్ ఉన్నంతవరకు సినిమాలు చేసి నాలుగు రాళ్లు సంపాదించుకుని ఆ తరవాత ఎంచక్కా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతుంటారు. ఇదెప్పటి నుంచో ఉన్నదే అయినా ఈ తరం హీరోయిన్లు డిఫరెంట్ కదా. అందుకే తమ జీవిత భాగస్వాములుగా ఫారిన్ అబ్బాయిలనే ఎంపిక చేసుకుంటున్నారు.

మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రియాంక చోప్రా. తరవాత ఇక్కడ స్టార్ హీరోయిన్ అయి ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ ఇప్పుడు అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో కలిసి తిరుగుతోంది. అతడ్ని వెంటేసుకుని ఇండియాకు వచ్చి గోవా టూర్ కు కూడా వెళ్లింది. ప్రియాంకానే కాదు.. విదేశీ అబ్బాయిలతో ప్రేమలో పడి వాళ్లను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా మరికొందరు బ్యూటీలు లైన్ లో ఉన్నారు. కోలీవుడ్ సుందరి శ్రుతి హాసన్ లండన్ కు చెందిన మైఖేల్ కార్సెల్ తో చాలాకాలంగా రిలేషన్ షిప్ మెయిన్ టెయిన్ చేస్తోంది. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ దక్కించుకున్న శ్రియ రీసెంట్ గా రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకో టాప్ హీరోయిన్ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ ఆండ్రీ నీబోన్ తో కలిసే ఉంటోంది.

నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా అనేది సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ లోని డైలాగ్. హీరోలంతా దాదాపుగా స్వదేశీ అమ్మాయిలనే పెళ్లి చేసుకుంటుంటే పవర్ స్టార్ మాత్రం రష్యాకు చెందిన అన్నా లెజ్నోవా ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో పవన్ ది ఓ రకంగా కొత్త ట్రెండే