Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలే బిజినెస్ టైకూన్లు!

By:  Tupaki Desk   |   7 April 2022 3:30 AM GMT
స్టార్ హీరోలే బిజినెస్ టైకూన్లు!
X
టాలీవుడ్ స్టార్ హీరోలు ఓ వైపు వృత్తి ప‌నుల్లో బిజీగా ఉన్నా.. వ్యాపార‌ల‌పైనా అంతే ఫోక‌స్డ్ గా ప‌నిచేస్తారు. పారితోషికం రూపంలో వ‌చ్చిన ఆదాన్ని ఇత‌ర వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్టి అక్క‌డా స‌క్సెస్ అవుతున్నారు. నిర్మాణ సంస్థ‌లు..రియ‌ల్ ఎస్టేట్లు..ఈ కామ‌ర్స్.. హోటల్స్..విదేశీ పెట్టుబ‌డులు స‌హా చాలా రంగాల్లో తెలుగు హీరోలు రాణిస్తున్నారు.

నాటి మేటి హీరోల నుంచి నేటి స్టార్ల వ‌ర‌కూ అంతా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి స‌క్సెస్ అయ్యారు. కొత్త బిజినెస్ ల్లోకి ఎంట‌ర్ అవ్వాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. మెజార్టీ హీరోలు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్ స‌హా స్మార్ట్ సిటీగా శ‌ర వేగంగా వృద్దిలోకి వ‌స్తోన్న విశాఖ‌ప‌ట్ట‌ణం లాంటి ఏరియాల్లో ప‌లువురు స్టార్ హీరోలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం.

వాటిలో రిసార్స్ట్ ఏర్పాటు చేస్తున్నారుట‌. ఓ స్టార్ హీరో విశాఖ‌ప‌ట్ట‌ణం-విజ‌య‌న‌గ‌రం మ‌ధ్య భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ఆల్యాండ్స్ లో 5 స్టార్ హోట‌ల్స్..రిసార్స్ట్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిసింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల‌తో పాటు..వివిధ గేమ్ షోలు...యాడ్స్ రూపంలో వ‌చ్చే ఆదాయాన్ని నిర్మాణ రంగంతో పాటు..రియ‌ల్ ఎస్టేట్స్ లో ఇన్వెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇప్ప‌టికే ఎయిర్ లైన్ బిజినెస్ లో దూసుకుపోతున్నారు. భార్య ఉపాస‌న‌తో క‌లిసి కొత్త స్టార్ట‌ప్ ల‌కి ప్లాన్ చేస్తున్నారుట‌. అలాగే హెల్త్ ప్రొడ‌క్ట్ ల‌పైనా పెట్టుబ‌డులు పెడుతున్నారుట‌. ఇటు నిర్మాత‌గాను రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సూప‌ర్ స్టార్ మ‌హేష్ మ‌ల్టీప్లెక్స్ బిజినెస్ ల్లో రాణిస్తున్నారు. ఏషియ‌న్ గ్రూప్ భాగ‌స్వామ్యంలో హీరోలిద్ద‌రు స‌క్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. ఇంకా బ‌న్నీ కి ప్రైమ్ ఏరియాల్లో ఖరీదైన ప‌బ్లు క‌ల్గి ఉన్నారు.

'ఆహా' ఓటీటీ డెవ‌లెప్ మెంట్ పైనా దృష్టిసారించారు. అలాగే యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఏషియ‌న్ గ్రూప్ టై అప్ తో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో మ‌ల్టీప్లెక్స్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. రౌడీ వేర్ బ్రాండ్ తో బ‌ట్ట‌ల వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు. ఇక సీనియ‌ర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి..న‌ట‌సింహ బాల‌కృష్ణ‌...కింగ్ నాగార్జున సైతం వ్యాపార రంగంలో రాణిస్తున్నారు.

మ‌గ్గురు హీరోలుల హైద‌రాబాద్ శివార్ల‌లో కొన్ని ల్యాండ్స్ ఉండ‌టంతో వాటిపై ఇన్వెస్ట్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా నాగార్జున‌-చిరు ఎప్ప‌టి నుంచో క‌లిసి వ్యాపారాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు హీరోలు విశాఖ స్టూడియోల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇండస్ర్టీ అభివృద్దికి కావాల్సిన అన్నిర‌కాల ఏర్పాట్లు..సౌక‌ర్యాలు క‌ల్పిస్తాన‌ని మాట ఇవ్వ‌డంతో చిరు-నాగ్ లు ముందుగా సీన్ లోకి దిగిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక బాలయ్య‌ మెడిక‌ల్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు తెలుస్తుంది. ఇంకా కొంత మంది యంగ్ హీరోలుల ఇండ‌స్ర్టీ ద్వారా వ‌స్తోన్న ఆదాయాన్ని వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా న‌వ‌త‌రం హీరోలు హోట‌ల్-రెస్టారెంట్ రంగంలో ఎక్కువ పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది.