Begin typing your search above and press return to search.
పుష్పరాజ్ గా గెటఫ్ తో క్రికెటర్ జడేజా షాక్ లు!
By: Tupaki Desk | 12 Jan 2022 3:44 PM GMTఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` పాన్ ఇండియా కేటగిరీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో మునుపెన్నడూ లేని విధంగా పుష్ప స్పూఫ్ వీడియోలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తగ్గేదే లే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా??… ఫైరూ…ఈ రెండు డైలాగులు ఇప్పటికీ బాగా పాపులరయ్యాయి. తాజాగా పుష్ప స్ఫూర్తితో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా పుష్ప రాజ్‌గా మారిపోయాడు. కథానాయకుడిలా మారి జేగురు జుట్టు గుబురు గడ్డంతో బీడీ (ముడి పొగాకు సిగరెట్) తాగుతూ జడేజా స్పెషల్ గా కనిపించాడు. అతడి కొత్త లుక్ నిజంగా షాక్ కి గురి చేస్తోంది.
``పుష్పా అంటే ఫ్లవర్ అనుకున్నావా... ఫైరు`` అని జడేజా ట్వీట్ చేశాడు. ఈ ఫోటో కొద్ది సేపటిలోనే పెద్ద రేంజులో వైరల్ గా మారింది. అయితే ఒక క్రికెటర్ గా బాధ్యతగలవాడిగా జడేజా పొగాకు వాడకానికి వ్యతిరేకంగా హెచ్చరిక జారీ చేశాడు. అది అతని బాధ్యతను తెలియజేస్తుంది. ఇంతకుముందు జడేజా `తగ్గేదే లే` అనే యూట్యూబ్ షార్ట్ వీడియోను పోస్ట్ చేశాడు.
ఇప్పటికే పుష్ప చిత్రంపైనా అల్లు అర్జున్ నటనపైనా బాలీవుడ్ దర్శకనిర్మాతలు హీరోలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. క్రికెటర్ల ప్రచారంతోనూ ఉత్తర భారత ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 350కోట్లు వసూలు చేసిన పుష్ప చిత్రం హిందీ వెర్షన్ 80కోట్లు వసూలు చేసింది. ఫిబ్రవరి నుంచి రెండవ భాగం పుష్ప: ది రూల్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ మేరకు సుకుమార్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సక్సెస్ నేపథ్యంలో కేజీఎఫ్ 2 తరహాలోనే అత్యంత భారీ యాక్షన్ తో సీక్వెల్ తెరకెక్కనుందని తెలుస్తోంది.