Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్స్ అంతా ఒకే సినిమాతో ఎంట్రీ
By: Tupaki Desk | 12 Nov 2021 2:04 AM GMTబాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాతలు తండ్రుల వారసత్వాన్ని అంది పుచ్చుకుని వారి వారసుల ఎంట్రీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. వారతసత్వంతో తెరకు పరిచయమైనా స్వయం ప్రతిభతో నిరూపించుకుని బిగ్ స్టార్స్ గా ఎదిగిన నటులు ఎంతో మంది ఉన్నారు. ఎక్కువగా బాలీవుడ్ లో వారసుల ఎంట్రీ సోలోగానే జరుగుతుంటుంది. అయితే ఈసారి మాత్రం కొంత మంది వారసులు ఓ గ్రూప్ గా ఏర్పడి అంతా ఒకే చిత్రంతో లాంచ్ అవ్వడం విశేషం. ఇంతకీ ఆ గ్రూప్ లో ఉన్నది ఎవరు? ఏ స్టార్ హీరో వారసులు ఎంట్రీ కి సిద్ధమవుతున్నారు? వంటి వివరాలు తెలియాలంటే అసల విషయంలోకి వెళ్లాల్సిందే.
బాద్ షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానే ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమయం వచ్చేసింది. ఒక హాలీవుడ్ కామిక్ సిరీస్ తో సుహానా బాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. అలాగే లెజండెరీ హీరోయిన్..అతిలోక సుందరి శ్రీదేవి రెండవ కుమార్తె ఖుషీ కపూర్ కూడా ఇదే చిత్రంతో లాంచ్ అవుతుంది. బిగ్ బీ అమితాబచ్చన్ మనవడు అగస్త్య నంద...బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ వారసుడు ఇబ్రహీం ఖాన్ కూడా ఈ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా వరుసగా బాలీవుడ్ నటుల వారసులు ఒకే చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
మరి ఏ పాత్రలు ఎలా ఉంటాయి? కంటెంట్ ఎలా ఉంటుంది? అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. నిర్మాత ఎవరు? ఏ ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కుతుంది? వంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఈ వార్త జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.