Begin typing your search above and press return to search.
'యంగ్ టైగర్'తో మరోసారి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..!
By: Tupaki Desk | 20 April 2021 7:30 AM GMTటాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంటనే తన తదుపరి మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్డం అందుకోనున్నాడు. అసలే రాజమౌళితో సినిమా అంటే అంచనాలు ఓ రేంజిలో ఉంటాయి. అలాంటిది ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో నాలుగో సినిమా ఇది. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు.
ఇటీవలే త్రివిక్రమ్ సినిమా కాన్సల్ అవ్వడంతో వెంటనే కొరటాల శివతో ఓకే చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుంది. డైరెక్టర్ కొరటాల ప్రస్తుతం ఆచార్య సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య ఈ ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ తో తీయబోయే సినిమా కోసం కొరటాల మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మనే ఎంపిక చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. వీరి కాంబినేషన్ లో ఆచార్య రూపొందగా.. రెండోసారి ఎన్టీఆర్ సినిమాకు పని చేయనున్నట్లు సినీవర్గాలలో చర్చలు నడుస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ - మణిశర్మ కాంబినేషన్ లో ఇదివరకు చాలా సూపర్ హిట్ ఆల్బమ్స్ ఉన్నాయి. చూడాలి మరి మళ్లీ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో!