Begin typing your search above and press return to search.

ఓటీటీ రిలీజులపై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   20 Jan 2021 1:30 PM
ఓటీటీ రిలీజులపై స్టార్ ప్రొడ్యూసర్ కామెంట్స్..!
X
ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ 'రెడ్' సంక్రాంతి కానుకగా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్ర‌వంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కరోనా లాక్ డౌన్ పెట్టడంతో వాయిదా పడుతూ వచ్చింది.

ఇదే సమయంలో పలు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశాయి. 'రెడ్' సినిమా కోసం ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేసినప్పటికీ మేకర్స్ మాత్రం ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తూ వచ్చారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళు రాబట్టింది. ఓటీటీ రిలీజ్ కి ఎందుకు ఇవ్వలేదనే విషయంపై నిర్మాత స్రవంతి రవి కిషోర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

''ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని, మంచి వసూళ్ల వస్తాయని ముందునుంచీ నమ్మకం ఉంది. అందరికీ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని మేం ఇన్నాళ్లూ ఎదురు చూశాం. అందుకే థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకే ఓటీటీలో విడుదల చేయలేదు. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 12 రూపాయలు వస్తే చాలు అనుకునే వాళ్లు ఉన్నారు. 10 రూపాయలకు 9 రూపాయలు వచ్చినా, 12 రూపాయలు వచ్చినా ప్రేక్షకుడి నుంచే నేరుగా రావాలని నేను ఆలోచిస్తా. సినిమాపై ఇలాంటి అభినివేశం ఉన్న నిర్మాతలం కొద్ది మంది ఉన్నాం.

మాకు సినిమా ఒక వ్యాపారం కాదు. ప్రేక్షకులు సినిమాను చూడాలనేది మా లక్ష్యం. పెట్టుబడిపై ఎంతో కొంత లాభం వస్తే చాలు అనుకుని సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లను మనం ప్రశ్నించలేం'' అని రవి కిషోర్ పరోక్షంగా ఓటీటీ రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ ను ఉద్దేశించి స్రవంతి రవి కిషోర్ మాట్లాడారు.

'ఇస్మార్ట్‌ శంకర్‌' విజయం తర్వాత రామ్‌ ఏ చిత్రం చేసినా.. ఆ సినిమాతో పోలుస్తారని తెలుసు. అందుకని 'రెడ్‌' చేయడం ఎంతవరకూ కరెక్ట్‌ అని మేం డిస్కస్‌ చేసుకున్నాం. 'ఇస్మార్ట్‌ శంకర్‌' విజయం భయపెట్టింది. ఆ సినిమాతో 'రెడ్‌'ను పోల్చలేం కానీ, ఇదీ మంచి చిత్రమే. కరోనా పరిస్థితుల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా బాగుపడాలనే ఉద్దేశంతో 'రెడ్' ముందు అనుకున్న దాని కంటే తక్కువ రేట్లకే అమ్మినాం. ఈ సినిమాను కొన్న అందరూ 4 రోజుల్లోపే బ్రేక్ ఈవెన్‌ కు వచ్చారు'' అని రవికిషోర్ తెలిపారు.