Begin typing your search above and press return to search.

దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్.. పెద్ద ప్లానే..

By:  Tupaki Desk   |   5 April 2023 7:08 PM
దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్.. పెద్ద ప్లానే..
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ఏడాది తన ప్రొడక్షన్ 2 నుంచి బలగం అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద ఇకపై భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తానని గతంలోనే దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.

అందులో భాగంగా ముందుగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉన్న గేమ్ చేంజర్ మూవీ ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వీటి తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయని గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అలాగే శాకుంతలం సినిమా కోసం కూడా దిల్ రాజు 40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ లో పాల్గొన్న దిల్ రాజు మరో క్రేజీ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. అది కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. తన ప్రొడక్షన్ నుంచి జటాయు అనే సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్లు చెప్పారు. భారీ టెక్నికల్ వాల్యూతో భారీ బడ్జెట్ తో ఈ మూవీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటిస్తారని కూడా చెప్పారు.

రామాయణంలోని రావణుడు సీతని అపహరించుకుపోయినపుడు అతనిని అడ్డుకున్న గరుడ పక్షి పేరు జటాయు. పక్షులలోకి అత్యంత బలమైనదిగా గరుడ పక్షికి పేరు ఉంది. అమాంతం మనుషులని కూడా ఎత్తుకుపోయే అంత సామర్ధ్యం ఈ గరుడ పక్షికి ఉంటుంది. అలాంటి గరుడ పక్షి అయిన జటాయు పేరు సినిమాకి దిల్ రాజు ఫిక్స్ చేసారు.

ఇది హై వోల్టేజ్ ఫిక్షనల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కే సినిమాగా ఉండే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. లేదంటే రామాయణంలోని జటాయు క్యారెక్టర్ ని మైథలాజికల్ కాన్సెప్ట్ తో మూవీ చేసే అవకాశం ఉంది. మరి ఈ రెండింటిలో దిల్ రాజు జటాయు మూవీ కోసం ఎలాంటి కాన్సెప్ట్ ని తీసుకుంటున్నారు. అలాగే ఈ మూవీలో హీరోగా ఎవరిని ఖరారు చేస్తారు అనేది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.