Begin typing your search above and press return to search.

సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ కి డిస్నీ యానిమేష‌న్ మూవీ ఆఫ‌ర్?

By:  Tupaki Desk   |   1 Dec 2020 1:30 PM GMT
సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ కి డిస్నీ యానిమేష‌న్ మూవీ ఆఫ‌ర్?
X
సౌత్ స్టార్ డైరెక్ట‌ర్ ఏ.ఆర్.మురుగ‌దాస్ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఆయ‌న హాలీవుడ్ రేంజ్ సినిమాలు తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో ఇటు సౌత్.. అటు హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌కుడిగా అత‌డికి ప్ర‌త్యేక‌మైన క్రేజు ఉంది.

తాజా సంచలనం ఏమంటే.. అత‌డు హాలీవుడ్ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని కోలీవుడ్ స‌ర్కిల్స్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న ఈ మూవీ క‌న్ఫామ్ అయితే సౌత్ నుంచి హాలీవుడ్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి గ్రేట్ డైరెక్ట‌ర్ గా రికార్డులకెక్కే వీలుంది. మురుగదాస్ ప్రస్తుతం తన తొలి హాలీవుడ్ చిత్రం కోసం హాలీవుడ్ ఫేమస్ స్టూడియో డిస్నీ పిక్చర్స్ ప్ర‌తినిధుల‌తో చర్చలు జరుపుతున్నార‌ని స‌మాచారం.

మురుగదాస్ తో డిస్నీ పిక్చర్స్ ప్ర‌తినిధులు `ది జంగిల్ బుక్`.. ది బ్యూటీ అండ్ ది బీస్ట్ తరహాలో లైవ్ యాక్షన్ కమ్ యానిమేషన్ చిత్రం గురించి చర్చిస్తున్నారు. ఈ ఊహాగానాలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

కెరీర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్ని తెర‌కెక్కించిన మురుగ‌దాస్ గ‌జిని-స‌ర్కార్- తుపాకి లాంటి స్పెష‌ల్ మూవీస్ ని తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి విజయ్ 65 వ చిత్రం కోసం చర్చలు జరుపుతున్నాడు. సృజనాత్మక వ్యత్యాసాల కారణంగా మురుగదాస్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలిగారు. అనంత‌రం డిస్నీవాళ్ల‌తో యానిమేష‌న్ మూవీకి స‌న్నాహాలు చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది.