Begin typing your search above and press return to search.
స్టార్ వార్స్ కి ఇక్కడ చుక్కలే
By: Tupaki Desk | 21 Dec 2015 7:30 PM GMTమొన్ననేమో అమెరికాలోమనకి చుక్కలు చూపించారు. మరి ఇప్పుడు మన వాళ్లు వదులుతారా.. ఇక్కడ మనోల్ళు కూడా సేమ్ టు సేమ్ చుక్కలు చూపించేస్తున్నారు. అప్పుడు మనకు ధియేటర్ల ప్రాబ్లం క్రియేట్ చేసిన ఈ ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా కు ఇప్పుడు ఇక్కడ ధియేరట్లు దొరకడం కష్టమైపోతోందట. దానితో లోకల్ డిస్ర్టిబ్యూటర్లకు ఏమి చేయాలో తెలియట్లేదు.
నిజానికి డిసెంబర్ 19న హాలీవుడ్ లో విడుదలైన స్టార్ వార్స్‌ః ది ఫోర్స్ ఎవేకన్స్ సినిమా.. అక్కడి బాక్సాఫీస్ లో అతి పెద్ద మ్యాజిక్ చేసింది. ఏకంగా 238 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ వీకెండ్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే అమెరికాలో 4500 స్ర్కీన్లలో విడుదలైన స్టార్ వార్స్ కారణంగా.. మన సినిమాలైన లోఫర్ - దిల్ వాలే - బాజీరావ్ మస్తానీలకు ధియేటర్లు దొరకలేదు. అమెరికాలో విపరీతంగా దండుకునే బాలీవుడ్ సినిమాలు కూడా ముక్కున వేలేసుకున్నాయే కాని.. ధియేటర్లను దక్కించుకోలేకపోయాయ్. కట్ చేస్తే.. వచ్చే 25న స్టార్ వార్స్ ఇండియాలో రిలీజ్ అవుతోంది. దాదాపు 1000 ధియేటర్లలో ఇంగ్లీష్ - హిందీ - తెలుగు - తమిళంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది వాల్ట్ డిస్నీ సంస్థ. అందుకే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయట.
అయితే ఇప్పుడు ధియేటర్లలో ఆల్రెడీ దిల్ వాలే - బాజీరావ్ - లోఫర్ సినిమాలు తెలుగు రాష్ట్రంలలో అల్లాడిస్తున్నాయి. పైగా వచ్చే వారం సౌఖ్యం, మామ మంచు అల్లుడు కంచు, జత కలిసే, భలే మంచి రోజు మొదలగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడో 200 ధియేటర్లు దక్కించుకోవడం అంటే కాస్త కష్టమే. అలాగే తమిళంలో కూడా చాలా సినిమాలు రిలీజవుతున్నాయి. హిందీలో రిలీజ్ లు లేకపోయినా.. ఉన్న సినిమాలను తీసేయకుండా 3 వారాల ఎగ్రిమెంటులు ఉన్నాయట. ఆ విధంగా స్టార్ వార్స్ కు చుక్కలు కనిపించేస్తున్నాయి.