Begin typing your search above and press return to search.

స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన స్టార్ రైటర్..!

By:  Tupaki Desk   |   9 Jan 2023 8:30 AM GMT
స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన స్టార్ రైటర్..!
X
టాలీవుడ్ స్టార్ రైటర్ కోనా వెంకట్ గురించి అందరికీ తెలిసిందే. శ్రీను వైట్లతో ఆయన కలిసి చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. స్క్రీన్ రైటర్ గా ఆయన స్కిల్స్ తో అందరిని అలరిస్తూ వచ్చారు. రైటర్ నుంచి నిర్మాతగా మారి కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో సినిమాలు కూడా చేస్తున్నారు కోనా వెంకట్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు కోనా వెంకట్. ఈ సినిమాతో మళ్లీ రైటర్ గా తన పేరు మారుమోగేలా చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్నేహితుడి కోసం గంజాయి అమ్మిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కోనా వెంకట్. కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ సూసైడ్ చేసుకోవాలని అనుకోగా హాస్పిటల్ లో ఉన్న అతని కష్టాలు తీర్చేందుకు అతను పండించిన గంజాయిని గోవాకి వెళ్లి అమ్మానని చెప్పి షాక్ ఇచ్చారు కోనా వెంకట్.

ఆ టైం లో తన మిగతా ఫ్రెండ్స్ సహాయంతో ఆదిలాబాద్ నుంచి రెండు చెక్ పోస్ట్ లను దాటించి గోవాకి గంజాయిని తీసుకెళ్లామని. అప్పట్లో తనది క్రిమినల్ బ్రెయిన్ అని ఆ తర్వాత అది క్రియేటివ్ బ్రెయిన్ గా మారిందని అన్నారు కోనా వెంకట్.

తన ఫాదర్ డి.ఎస్.పి, తాత గవర్నర్ తాను ఒకవేళ పట్టుబడితే చాలా పెద్ద గొడవ అయ్యేది కానీ ఆ టైం లో అలాంటివి ఏమీ ఆలోచించకుండా తన ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలన్న ఒకే ఒక్క కారణం తోనే తను అలా చేశానని అన్నారు కోనా వెంకట్.

ఆ టైం లో పోలీసులకు దొరికితే జైల్లో వేసేవారని. దానికి కూడా సిద్ధమై అలా రిస్క్ చేసినట్టు చెప్పుకొచ్చారు కోనా వెంకట్. స్నేహితుడు కోసం రిస్క్ చేసి మరీ అతనికి హెల్ప్ చేసి తన మంచి మనసును చాటుకున్నారు స్టార్ రైటర్ కోనా వెంకట్.

రైటర్ గా ఈమధ్య తన దూకుడు తగ్గించగా వాల్తేరు వీరయ్యతో మరోసారి ఆయన సత్తా చాటనున్నారు. తప్పకుండా వాల్తేరు వీరయ్య సంక్రాంతికి విన్నర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ అందరికి ఈ సినిమా సూపర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుతో పాటుగా మాస్ మహారాజ్ రవితేజ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.