Begin typing your search above and press return to search.

సెట్ లో లెన్స్ వేస్తే 10 కోట్ల మంది క‌నిపిస్తారు!- రామ్

By:  Tupaki Desk   |   12 July 2022 3:48 PM GMT
సెట్ లో లెన్స్ వేస్తే 10 కోట్ల మంది క‌నిపిస్తారు!- రామ్
X
కెరీర్ లో వైవిధ్యం ఉన్న పాత్ర‌ల‌తో మెప్పించేందుకు రామ్ త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఒక్కోసారి ఫెయిలైనా సక్సెసైతే ద‌క్కే కిక్కును ఆస్వాధిస్తున్నాడు. ఇంత‌కుముందు ఇస్మార్ట్ శంక‌ర్ తో ఆ కిక్కును ఆస్వాధించాడు. ఇప్పుడు ప‌వ‌ర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని నటించారు. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీ టైటిల్ -ది వారియ‌ర్. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు- తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్ తో ఇంటర్వ్యూ...

ప్రశ్న:ది వారియర్' ట్రైలర్ బావుంది. ఈ కథ కంటే ముందు కొన్ని కథలు రిజెక్ట్ చేశానని చెప్పారు. వారియ‌ర్ క‌థ‌లో ఏం నచ్చింది?

రామ్: పోలీస్ కథ చేద్దామనుకున్నాను. నాలుగైదు కథలు విన్నాను. అనీ రొటీన్ అనిపించాయి. పోలీస్ కథలు చేస్తే ఫ్రెష్‌నెస్‌ ఉండాలనేది నా ఫీలింగ్. రొటీన్ కథలు విని వద్దని డిసైడ్ అయ్యాను. లింగుస్వామి కథ చెప్పడానికి వస్తానంటే సరేనన్నాను. అప్పుడు పోలీస్ కథ అని తెలియదు. కథ చెప్పే ముందు నాకు విషయం తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనేదానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. 'ది వారియర్'లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. 'మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?' అని అడిగితే... 'కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా' అని చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే... లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించా.

ప్రశ్న: 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత మీ ఆలోచనా విధానం మారినట్టు అనిపిస్తోంది. మాస్, కమర్షియల్ సినిమాలతో ఎంట‌ర్ టైన్‌ చేస్తున్నారు!

రామ్: (నవ్వుతూ...) 'ఇస్మార్ట్ శంకర్' కంటే ముందే మారింది. అందుకే, ఆ సినిమా చేశా.

ప్రశ్న: జీవితం ముఖ్యమా? సినిమాలు ముఖ్యమా? అని డాక్టర్ ప్రశ్నించారని చెప్పారు. అసలు ఏమైంది?

రామ్: కొంచెం సీరియస్ ఇంజ్యూరీ అయ్యింది. స్పైనల్ కార్డ్ ఇంజ్యూరీ అంటే చిన్నది కాదు కదా! ఎడమ చెయ్యి పని చేయలేదు. జిమ్ చేసిన తర్వాత మూడు నెలలు ఖాళీగా ఉండటం కష్టం అయ్యింది. ఆ సమయంలో డాక్టర్ అలా ప్రశ్నించే సరికి... 'అలా అడిగారు ఏంటి?' అనుకున్నాను. తర్వాత వారానికి సెట్ అయ్యాను. అప్పటికి ఆది పినిశెట్టి వేరే సినిమాలు చేయకుండా అలా ఉన్నాడు. పెళ్ళికి రెడీ అవుతున్నాడు. అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా! డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్. నాకు ఏమో నా వల్ల అందరూ వెయిట్ చేస్తున్నారని ఫీలింగ్. సినిమాలే లైఫ్ అనుకునే నాకు అది అవుటాఫ్ సిలబస్ క్వశ్చన్ లా అనిపించింది.

ప్రశ్న: 'ఇస్మార్ట్ శంకర్' మీ కెరీర్‌లో పెద్ద హిట్. అటువంటి బ్లాక్ బస్టర్ తర్వాత లెక్కలు వేసుకుని సినిమాలు చేస్తారు. లింగుస్వామికి ఈ మధ్య పెద్ద విజయాలు లేవు. ఆయనతో సినిమా చేయడానికి కారణం?

రామ్: అటువంటి లెక్కలు వేసుకుంటే 'ఇస్మార్ట్ శంకర్' కూడా చేసేవాడిని కాదు. పూరి జగన్నాథ్ గారు, లింగుస్వామి గారు ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ... వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బావుంటుంది. లింగుస్వామి గారు కూడా అంతే! ఫైనల్‌గా ఈ స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయ్యాం. ఈ స్క్రిప్ట్ లింగుస్వామి సినిమాగా మారితే ఎలా ఉంటుందో నేను చూశా. నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది.

ప్రశ్న: ప్రతినాయకుడి పాత్రకు ఆది పినిశెట్టిని తీసుకున్నారు. ఆ ఛాయిస్ ఎవరిది?

రామ్: కథ చెప్పినప్పుడు ఆది పినిశెట్టి రోల్... గురు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సినిమాకు ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేస్తున్నారు? అనేది టెన్షన్. అయితే, లింగుస్వామి గారు ఆది పేరు చెప్పినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆది ఏమో సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథ చెప్పాక... ఆయన కూడా ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకే చెప్పేసి క్యారెక్టర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు.

ప్రశ్న: బుల్లెట్, విజిల్ సాంగ్స్ ఛార్ట్‌బ‌స్ట‌ర్స్‌ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి...

రామ్: మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారు. దేవితో నాకు ఏడో సినిమా ఇది. లింగుస్వామి గారు స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి... రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. పాటలు కూడా కార్ స్పీకర్‌లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్‌లో వేరు. ఒక్కో స్పీకర్‌లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు... కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియ‌న్స్‌ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్... కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది.

ప్రశ్న: శింబు ఒక పాట పాడారు. మీకు ఎలా అనిపించింది?

రామ్: తమిళంలో శింబు 'లూసు పెన్నే' అని ఒక పాట పాడారు. 'బుల్లెట్...' పాటకు శింబు అయితే బావుంటుందని చెప్పగానే నాకు ఆ వాయిస్ గుర్తు వచ్చింది. తెలుగులో 80 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 70 మిలియన్ ప్లస్ వచ్చాయి. తమిళంలో అంత రీచ్ రావడానికి శింబు ఒక కారణం.

ప్రశ్న: 'ది వారియర్'తో మీరు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తమిళంలో నటించడం గురించి...

రామ్: నేను ఎప్పటి నుంచో తమిళంలో చేయాలనుకుంటున్నాను. కథలు సెట్ కాలేదు. తమిళ్ నుంచి సూపర్ స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ, అవి తెలుగులో తేడా కొడతాయేమో అనిపించింది. తెలుగు, తమిళ్... రెండు వర్కవుట్ అయ్యే స్క్రిప్ట్ దొరికితే చేద్దామనుకున్నాను. లింగుస్వామి గారు చెప్పిన స్క్రిప్ట్ కుదిరింది.

ప్రశ్న: తమిళ్ వెర్షన్ డబ్బింగ్ కూడా ఫాస్ట్ గా చెప్పారట!

రామ్: నేను చెన్నైలో పెరిగాను కదా! తమిళ్ మాట్లాడటం వచ్చు. డబ్బింగ్ చెప్పడం కూడా ఈజీగా అనిపించింది. నేను ఒక్కడినే డబ్బింగ్ చెబుతా. వేరే వాళ్ళు ఉండటం ఇష్టం ఉండదు. కరెక్షన్స్ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. లింగుస్వామిగారితో అదే చెప్పాను. నేను మొత్తం డబ్బింగ్ చెప్పిన తర్వాత మీరు వినండి. మళ్ళీ కరెక్షన్స్ ఉంటే చెప్పండి. అప్పుడు వచ్చి చెబుతానని అన్నాను. ఒక్క సెన్సార్ కరెక్షన్ తప్ప ఏమీ లేదు. లింగుస్వామి గారు షాక్ అయ్యారు. 'అంత పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పారు. నేను ఊహించలేదు' అని అన్నారు.

ప్రశ్న: బ్యాక్ టు బ్యాక్ శ్రీనివాసా చిట్టూరి గారితో చేస్తున్నారు.

రామ్: 'మీతో పని చేసిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ మీతో చేస్తున్నారు' అని మొన్నే ఆయనతో అన్నాను. ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడరు. చాలా సైలెంట్. నేను ఇంకో సినిమా ఎందుకు చేస్తున్నాను? నాకు ఆయన ఏం చేశారు? అని ఎనలైజ్ చేస్తున్నాను. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను చేయబోయే సినిమాకు ఆయన నిర్మాత అనేది తెలిసిందే.

ప్రశ్న: కరోనా సయమంలో వారియర్ అనే పదం బాగా పాపులర్ అయ్యింది. దానికి, ఈ సినిమాకు ఏమైనా సంబంధం ఉందా?

రామ్: కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అనే పదం బాగా నచ్చింది. ఎవరూ బయటకు రాకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు డాక్టర్లు, పోలీసులు బయటకు వచ్చారు. అందుకని, వారియర్ టైటిల్ పెట్టాం.

ప్రశ్న: కృతి శెట్టి గురించి...

రామ్: వర్క్ మీద ఆమెకు చాలా డెడికేషన్ ఉంది. గౌరవం ఉంది. మనం చేసే పని మీద మనకు గౌరవం ఉంటే మిగతావన్నీ సెట్ అవుతాయి.

ప్రశ్న: మోకాలికి గాయమైనా సాంగ్ షూటింగ్ చేశారని విన్నాను. ఇప్పుడు మీరు అంత చేయాల్సిన అవసరం ఉందా?

రామ్: అవసరం లేదని చాలా మంది అంటున్నారు. దర్శకులు కూడా! కానీ, ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసం చేయాలని నాకు అనిపించింది. చేస్తున్నాను. సెట్‌కు వెళ్లిన తర్వాత కెమెరా చూస్తే కెమెరా లెన్స్ కనిపించదు. పదికోట్ల మంది కనిపిస్తారు. నా కోసం థియేటర్లకు వచ్చి చూస్తున్నారంటే... నేను చేయగలననే ఫీలింగ్ వస్తే 100 పర్సెంట్ చేయాల్సిందే.

ప్రశ్న: బోయపాటితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దాని గురించి...

రామ్: నా సినిమాలు హిందీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక హీరోను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన సినిమా చేస్తారు. అందుకని, భారం అంతా ఆయన మీద వేశా.

ప్రశ్న: మీకే తెలియని మీ స్కూల్ గాళ్ ఫ్రెండ్ గురించి మాకు చెప్పండి.

రామ్: ఏం చెప్పాలి? ఆ అమ్మాయిని అడిగి నాకు చెప్పండి. నేను ఎందుకు రియాక్ట్ అయ్యానంటే... సీక్రెట్ చైల్డ్‌హుడ్‌ గాళ్ ఫ్రెండ్ అని రాశారు. ఇంట్లో వాళ్ళు కూడా డౌట్ డౌట్ గా చూడటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ కూడా నెమ్మదిగా 'మాకే తెలియకుండా ఏంటిది?' అని ఫోన్స్ చేయడం స్టార్ట్ చేశారు. 'ఏం లేకుండా రాస్తారంటావా?' అనే క్వశ్చన్ వచ్చింది. అందుకని, జెన్యూన్ గా అడిగా... నేను స్కూల్ కి ఎప్పుడు వెళ్లానని!

ప్రశ్న: హిందీలో మీకు మంచి మార్కెట్ ఉంది. హిందీ ప్రేక్షకుల కోసం, వాళ్ళకు తగ్గట్టు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటారా?

రామ్: హిందీ మార్కెట్ కోసం మనం కొత్తగా ఏమీ చేయకూడదని నేను నమ్ముతా. వాళ్ళు హిందీ సినిమాలు చూస్తున్నారు. తెలుగు, సౌత్ సినిమాలు చూసేది మన ఫ్లేవర్ కోసం! మనం క‌న్‌ఫ్యూజ్‌ అయిపోయి బాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తామంటే హిందీ ప్రేక్షకులు చూడరు. హిందీ మార్కెట్ కోసం మనం ట్రై చేయలేదు. హిందీలో డబ్బింగ్ అయినప్పుడు చూశారు.

ప్రశ్న: బోయపాటి తర్వాత హరీష్ శంకర్ .. రావిపూడి ఎవ‌రితో?

రామ్: అందరితో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎవరితో ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. కరోనా వల్ల మనకు బ్రేక్స్ వచ్చాయి. అందుకని, 'ది వారియర్' విడుదల తర్వాత బోయపాటి శ్రీను గారి సినిమా స్టార్ట్ చేస్తున్నాను.