Begin typing your search above and press return to search.

మళ్లీ జీరో కు చేరిన స్టార్‌ హీరోయిన్‌ కెరీర్‌

By:  Tupaki Desk   |   16 Nov 2019 6:25 AM GMT
మళ్లీ జీరో కు చేరిన స్టార్‌ హీరోయిన్‌ కెరీర్‌
X
తెలుగు ప్రేక్షకుల కు 'దేవదాస్‌' చిత్రంతో పరిచయం అయిన ముద్దు గుమ్మ ఇలియానా చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌ గా మారి పోయింది. టాలీవుడ్‌ లోని దాదాపు స్టార్‌ హీరోలందరి తో కూడా నటించేసిన ఈ అమ్మడు తమిళం లో కూడా తన సత్తా చాటింది. తెలుగు లో మొదటి కోటి పారితోషికం తీసుకున్న హీరోయిన్‌ గా ఇలియానా నిలిచింది అంటే ఆమె క్రేజ్‌ ఏ స్థాయి లో అప్పట్లో కొనసాగిందో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ గా ఉన్న సమయంలో బాలీవుడ్‌ నుండి వచ్చిన ఆఫర్‌ తో అక్కడ కు వెళ్లింది.

బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తూ కూడా సౌత్‌ లో సినిమాలు చేయవచ్చు. కాని ఇలియానా మాత్రం పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. తెలుగు మరియు తమిళం నుండి ఆఫర్లు వచ్చినా తిరష్కరించింది. బాలీవుడ్‌ లో ఈమె జోరు కొంత కాలమే కొనసాగింది. బాలీవుడ్‌ లో అవకాశాలు తగ్గిన నేపథ్యం లో మళ్లీ సౌత్‌ లో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పింది. రవితేజ అమర్‌ అక్బర్‌ ఆంటోనీ సినిమాతో ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఇలియానా మరీ ఎక్కువ లావు ఉందనే విమర్శలు ఎదుర్కొంది.

సౌత్‌ లో రాణించాలంటే ముఖ్యం గా తెలుగు లో అవకాశాలు దక్కించుకోవాలంటే బరువు తగ్గాలని భావించింది. అందుకోసం ఇలియానా బరువు కూడా తగ్గింది. సన్నబడ్డ ఈ సుందరి గత కొన్ని రోజులుగా తన సోషల్‌ మీడియా పేజ్‌ లలో హాట్‌ ఫొటో షూట్స్‌ ను పోస్ట్‌ చేస్తూనే ఉంది. బాలీవుడ్‌ లో ఆఫర్లు లేని ఈ అమ్మడు టాలీవుడ్‌ లో ఉన్న పరిచయాల ద్వారా మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. సాదారణంగా కెరీర్‌ ఆరంభంలో ఎలా అయితే ఆఫర్ల కోసం ఆసక్తి గా ఎదురు చూస్తారో అలాగే ఇప్పుడు ఇలియానా కూడా ఒక్క ఛాన్స్‌ అన్నట్లుగా ఎదురు చూస్తోంది.

ఆ ఒక్క ఛాన్స్‌ వస్తే మళ్లీ టాలీవుడ్‌ లో బిజీ అవ్వొచ్చు అనే ఉద్దేశ్యం తో ఇల్లీ బేబీ ఆశ పడుతోంది. కాని ఆ ఒక్క ఛాన్స్‌ మాత్రం ఏ ఒక్కరు ఇవ్వడం లేదు. గతంలో ఆమె వెంట పడ్డ నిర్మాతలు మరియు దర్శకులు ఆమెకు దొరక్కుండా తిరుగుతున్నారట. ఇలియానా ప్రస్తుతం యంగ్‌ హీరోల కు సెట్‌ అవ్వదు.. సీనియర్‌ హీరోల కు సెట్‌ అవ్వదనే కామెంట్‌ వినిపిస్తుంది. ఇలియానా కెరీర్‌ మళ్లీ పుంజుకుంటుందనే నమ్మకం లేదంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కాని ఇలియానా మాత్రం ప్రయత్నాలు వదలడం లేదు.