Begin typing your search above and press return to search.
విరూపాక్షగా మోహన్ బాబు విశ్వరూపమే 'సన్ ఆఫ్ ఇండియా'
By: Tupaki Desk | 5 March 2021 10:40 AM GMTమోహన్ బాబు పేరు వింటే చాలు నిబ్బరంగా నిలిచే నిండైన విగ్రహం కళ్లముందు కనిపిస్తుంది. ఏకధాటిగా .. అనర్గళంగా ఆయన చెప్పే డైలాగ్స్ మంత్రంలా వినిపిస్తాయి .. మంత్రముగ్ధులను చేస్తాయి. మోహన్ బాబుకి ఈ స్థాయికి క్రేజ్ ను తీసుకొచ్చినవి ఆయన రూపం .. నటన .. డైలాగ్ డెలివరీ అని చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీలో ఆయనకి ఎదురులేదు .. తిరుగులేదు. సెట్లో మోహన్ బాబు కాంబినేషన్ సీన్ అంటే ఎంతటి ఆర్టిస్ట్ అయినా కంగారుపడవలసిందే. అలా తన డైలాగ్ డెలివరీతో డామినేట్ చేయడం ఆయన ప్రత్యేకత.
మొదటి నుంచి కూడా మోహన్ బాబుకి ఒక డిఫరెంట్ బాడీలాంగ్వేజ్ ఉంది .. అలాగే ఆయన డైలాగ్ డెలివరీ కూడా విభిన్నంగానే అనిపిస్తుంది. ఈ రెండిటినీ ఇంతవరకూ ఎవరూ అనుసరించలేకపోయారు .. అనుకరించలేకపోయారు. అందువలన తను ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి తనకి తాను మాత్రమే పోటీ అని చెప్పిన విలక్షణ నటుడు .. మోహన్ బాబు. ఆయన పాత్రకి డైలాగ్స్ రాసే రచయితలు ఒక పండుగ వచ్చినట్టుగానే భావిస్తారు. తాము రాసిన డైలాగ్స్ కి ఆయన అంతలా న్యాయం చేస్తారని నమ్ముతారు. పదునైన డైలాగులను పరిగెత్తిస్తారు.
మోహన్ బాబు నటించిన ప్రతి సినిమాలోను డైలాగులు డైనమేట్లలా పేలుతుంటాయి. 'అసెంబ్లీ రౌడీ' .. 'పెదరాయుడు' .. 'మేజర్ చంద్రకాంత్' లాంటి సినిమాలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఇప్పుడు అదేస్థాయిలో మోహన్ బాబు తన డైలాగులతో చెలరేగిపోయే సినిమాగా 'సన్ ఆఫ్ ఇండియా' రూపొందుతోంది. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు రచయితగా .. దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో 'విరూపాక్ష' అనే పవర్ఫుల్ పాత్రలో మోహన్ బాబు తన నట విశ్వరూపాన్ని చూపించనున్నారనే అంటున్నారు.
డైమండ్ రత్నబాబుకి రచయితగా మంచి అనుభవం ఉంది. పైగా ఆయనకి మోహన్ బాబు బాడీ లాంగ్వేజ్ బాగా తెలుసు. అందువలన మోహన్ బాబు పవర్ఫుల్ పాత్రకి తగినట్టుగానే ఆయన తూటాల్లాంటి మాటలు రాశాడట. దేశభక్తిని ప్రేరేపించే మాటలు మోహన్ బాబు చెబుతూ ఉంటే, ఉడుకు నెత్తురు ఉప్పెనలా పొంగుతుందని అంటున్నారు. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా .. చూడాలనిపించేలా ఉంటాయని చెప్పుకుంటున్నారు. డైలాగ్స్ పరంగా గుర్తుపెట్టుకోదగిన మోహన్ బాబు సినిమాల్లో ఈ సినిమా కూడా చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి, ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.