Begin typing your search above and press return to search.
దసరా కోసం పోటీ పడుతున్న స్టార్స్.. ఎవరి రేంజ్ ఎంత?
By: Tupaki Desk | 5 Feb 2023 8:00 AM GMTబాలయ్య మళ్లీ వస్తన్నాడు.. పవర్‌స్టార్ రెడీ అవుతున్నాడు... మహేశ్‌బాబు-రవితేజ-విజయ్‌దేవరకొండ కూడా మేము సైతం అంటున్నారు... ఎక్కడికి, ఎందుకు అనుకుంటున్నారా? ఈ ఏడాది థియేటర్లలో దసరా పండగకి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైపోతున్నారు. అసలే సినీ ఇండిస్ట్రీలో సంక్రాంతి తర్వాత ఎదురుచూస్తే మరో పెద్ద పండగ దసరా. ప్రతి ఏటాఈ పండగ వచ్చిందంటే చాలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్లో సందడి ఉంటుందో తెలిసిన విషయమే. ఇక బాక్సాఫీక్ మరోసారి ఫైట్‌కు రంగం సిద్ధమవుతోంది. స్టార్ హీరోలంతా రంగంలోకి దిగబోతున్నారు. అయితే అందరూ వస్తారనే నమ్మకం లేదు. కానీ క్లాష్ సెట్ అయితే మాములుగా ఉండదు.
ఆ చిత్రాలు ఏంటంటే.. పవన్ కల్యాణ్ హీరోగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం దసరాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం. కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది.
సూపర్ స్టార్ మహేశ్‌బాబు -త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా SSMB 28. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా సెట్స్‌పైకి వెళ్లని ఈ చిత్ర ప్రీ బిజినెస్.. నాన్ థియేట్రికల్ హక్కులు రూ.300కోట్లకు అమ్ముడుపోయాయని తెలిసింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇకపోతే మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది.
స్టార్ హీరోయిన్ సమంత - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ఖుషి. . శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే 60 శాతంపైగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లలో విడుదలవుతోందా అని ఎదురుచూస్తున్నారు. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇది కూడా దసరాకే రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే వీరసింహారెడ్డితో సూపర్ హిట్‌ను అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ఎన్బీకే 108కోసం సిద్ధమవుతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో రాబుతున్న ఈ సినిమాను కూడా దసరాకే విడుదల చేయాలని ఆలోచిస్తున్నారుట. దీనికి సంగీతం తమన్ అందిస్తున్నారు.
స్టూవర్ట్‌పురం దొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకులు. హిందీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ నటిస్తున్న ఈ పాన్ ఇండియ సినిమాను కూడా దసరాకే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.