Begin typing your search above and press return to search.
స్టార్లతో నిండుతున్న వెబ్ సిరీస్ లు
By: Tupaki Desk | 6 Jun 2018 6:24 AM GMTటాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటి దాకా అయితే సినిమా లేదా టీవీ ఈ రెండు మాత్రమే ప్రేక్షకులకు వినోదం అందించడానికి ఆప్షన్స్ గా ఉండేవి. 4జి పుణ్యమా అని ఇప్పుడు ఇదిప్పుడు కొత్త దారులు వెతుకుతోంది. అదే వెబ్ సిరీస్. హాలీవుడ్ లో ఇది ఎప్పుడో మొదలయ్యింది కానీ డేటా ఖరీదు ఎక్కువగా ఉండే ఇండియాకు రావడానికి మాత్రం కొంత టైం తీసుకుంది. తెలుగులో కూడా దీనికి బలంగా శ్రీకారం పడటం విశేషం. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ విడుదల గ్యాంగ్ స్టార్స్ లో జగపతి బాబు-పోసాని-కృష్ణభగవాన్-నవదీప్- శ్వేతా బసు ప్రసాద్ లాంటి పేరున్న తారలు నటించడంతో పాటు కంటెంట్ కూడా విషయం ఉన్నదే కావడంతో బాగా ఆదరణ దక్కుతోంది. మొత్తం నాలుగు గంటల వ్యవధి ఉన్న 12 ఎపిసోడ్లకు మంచి ఆదరణ దక్కిందని సంస్థ ప్రకటించింది. అలా అని ఇది మొదటిదికాదు . గతంలో వరుణ్ సందేశ్-నాగ అశ్విన్-నీహారిక వీళ్లంతా విజయవంతగా ఇలాంటి వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసిన వాళ్లే. కానీ అంతగా ప్రమోట్ కాకపోవడంతో జనానికి ఎక్కువగా రీచ్ కాలేదు.
ఇప్పుడు ఇతర బాషా పరిశ్రమలో కూడా వెబ్ సిరీస్ లో నటించేందుకు స్టార్ హీరోలు ముందుకు వస్తున్నారు. కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ఇప్పటికే ఒక దానికి అంగీకారం తెలుపడం శాండల్ వుడ్ లో సంచలనం రేపుతోంది. సైఫ్ అలీ ఖాన్ నెట్ ఫ్లిక్స్ కోసం ఒకదాని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. రానా గతంలోనే ఈ దిశగా అడుగులు వేసాడు. తమిళ్ లో మాధవన్ చేసిన బ్రీత్ ఆన్ లైన్ చేసిన సంచలనం చిన్నదేమీ కాదు. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే వీలుండటం వల్ల వీటికి భవిష్యత్తులో మంచి స్కోప్ ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఒక సిరీస్ తో ఆపకుండా సీజన్ 1 సీజన్ 2 అని కంటిన్యూ చేయటం చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ లు సీరియల్స్ కి మంచి ప్రత్యాన్మయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మన అభిమాన తారలు నటించిన కొత్త సినిమాల లాంటి సినిమాలు చూడాలంటే థియేటరే అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అప్పుడెప్పుడో కమల్ హాసన్ అన్నట్టు ఫ్యూచర్ అంతా డిజిటల్ ఎంటెర్టైనెంట్ దే అయ్యేలా ఉంది. మార్పు మంచిదే కానీ వీటి ప్రభావం సినిమా హాళ్ల మీద ఎంత వరకు ఉంటుందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు.