Begin typing your search above and press return to search.

నయన్‌ పెళ్లికి హాజరైన స్టార్స్‌ వీళ్లే..!

By:  Tupaki Desk   |   9 Jun 2022 7:30 AM GMT
నయన్‌ పెళ్లికి హాజరైన స్టార్స్‌ వీళ్లే..!
X
లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన ప్రియుడు విఘ్నేష్‌ శివన్ ను నేడు పెళ్లి చేసుకుంది. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరి ప్రేమ మరియు పెళ్లి విషయం గురించి సుదీర్ఘ కాలంగా చర్చ జరుగుతోంది. వీరి వివాహం తమిళ హిందూ సాంప్రదాయం ప్రకారం మహాబలిపురంలోని ఒక ప్రైవేట్‌ ప్లేస్ లో వైభవంగా జరిగింది. అత్యంత ప్రముఖ వ్యక్తులకు మాత్రమే నయన్‌ విఘ్నేష్ ల పెళ్లి ఆహ్వాన పత్రికలు అందాయి.

హీరోయిన్‌ గా నయనతార తమిళం మరియు తెలుగు లోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. అన్ని భాషల సినీ ప్రముఖులతో కూడా నయన్‌ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే ఈ వివాహ వేడుకకు భారీ ఎత్తున సినీ జనాలు హాజరు అయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నయన్‌.. విఘ్నేష్ శివన్‌ ల వివాహ వేడుకకు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌.. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ ఇంకా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీ నటులు పాల్గొన్నారు. ఇక ఈ వివాహ వేడుకలో విఘ్నేష్‌ శివన్ తో వర్క్ చేసిన కొందరు నటీ నటులు కూడా హాజరు అయ్యారు.

ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్ ఈ పెళ్లి వేడుక నిర్వహణలో కీలక పాత్ర పోషించారని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే పెళ్లి తంతు పూర్తి అయ్యింది. మరి కాసేపట్లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆ సమయంలో అసలు నయన్‌ మరియు విఘ్నేష్‌ శివన్ ల వివాహానికి హాజరు అయిన ప్రముఖులు ఎవరు అనే విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కు కూడా విఘ్నేష్‌.. నయన్‌ లు ఆహ్వాన పత్రిక అందించారు. ఆయన కూడా పెళ్లికి హాజరు అయ్యి నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు అంటూ వార్తలు వచ్చాయి.

సీఎం పెళ్లికి హాజరు అయ్యాడా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. మొత్తానికి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల్లో కొద్ది మంది మాత్రమే ఈ వివాహానికి హాజరు అయినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్‌ నుండి నయన్‌ పెళ్లికి ఎవరైనా హాజరు అయ్యారా అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.