Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: అరుదైన వ్యాధులున్నా స్టార్ల గ‌ట్స్

By:  Tupaki Desk   |   18 Jan 2023 4:38 AM GMT
ట్రెండీ స్టోరి: అరుదైన వ్యాధులున్నా స్టార్ల గ‌ట్స్
X
కొన్ని నెలల క్రితం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మ‌యోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్ తో బాధపడుతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో తన అభిమానులకు వెల్ల‌డించింది. రుగ్మత ప్రధాన లక్షణాల గురించి చెప్ప‌గా అభిమానులు క‌ల‌త చెందారు. బలహీనంగా ఉండ‌డం.. భ‌రించ‌లేని కండ‌రాల‌ నొప్పి గురించి స‌మంత వెల్ల‌డించ‌గా ఫ్యాన్స్ తీవ్ర క‌ల‌త చెందారు. స‌మంత త్వ‌ర‌గా కోలుకుని సినిమాల్లో నటించాల‌ని అభిమానులు ఆకాంక్షించారు.

ఇంత‌లోనే మరో సౌత్ క‌థానాయిక‌ ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్ల‌డించి షాక్ కి గురి చేసింది. తనకు విటిలిగో అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి సోకిందని న‌టి కం గాయ‌ని మమతా మోహన్ దాస్ వెల్లడించారు.

ఈ వార్త విన‌గానే అంతా షాక్ తిన్నారు. క్యాన్స‌ర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మ‌ల‌యాళంలో తిరిగి కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అవుతున్న మ‌మ‌తా మోహ‌న్ దాస్ త‌న స‌మ‌స్య‌ను బ‌హిరంగ వేదిక‌పై ఓపెన్ గా వెల్ల‌డించ‌డంతో త‌న గ‌ట్స్ ని మెచ్చుకోని వారు లేరు.

కొన్నేళ్ల క్రితం కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ కు ట్రిజెమినల్ న్యూరల్జియా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇది ముఖం ఒక వైపున విద్యుత్ షాక్ వంటి బాధాకరమైన ఫీలింగ్ ని కలిగించే పరిస్థితి.

యామీ గౌతమ్ నిస్సందేహంగా బాలీవుడ్ లో అందమైన ప్ర‌తిభావంత‌మైన న‌టి. 2021లో నటి కెరటోసిస్ పిలారిస్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నాన‌ని బ‌హిరంగంగా వెల్ల‌డించింది. బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిభావనిగా గుర్తింపు తెచ్చుకున్న యామి ఫ్యాన్స్ తీవ్రంగా క‌ల‌త చెందారు.

గత సంవత్సరం బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ తో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. ఒక కార్యక్రమంలో యువ ధావ‌న్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించాడు. నాకు వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే రుగ్మ‌త ఉంద‌ని బ‌హిరంగంగా వెల్లడించ‌డంతో అంతా షాక్ తిన్నారు. అభిమానులు తీవ్ర క‌ల‌త‌కు గుర‌య్యారు. ఈ వ్యాధి ల‌క్ష‌ణం ప్రాథమికంగా బ్యాలెన్సింగ్ ఆఫ్ అవుతుంది. కానీ నేను నన్ను చాలా క‌నిపెట్టుకుని ఉంటాను.. అని వ‌రుణ్ ధావ‌న్ తెలిపారు. అభిమానులు క‌ల‌త చెంద‌డం వ‌ర‌కే. కానీ విధిని మార్చ‌లేరు!!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.