Begin typing your search above and press return to search.

సౌత్ సినిమా చూసి బాలీవుడ్ నేర్చుకోవాల‌నేసిన స్టార్స్!

By:  Tupaki Desk   |   23 April 2022 10:30 AM GMT
సౌత్ సినిమా చూసి బాలీవుడ్ నేర్చుకోవాల‌నేసిన స్టార్స్!
X
బాలీవుడ్ లో సౌత్ కంటెంట్ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు సినిమా అయిన‌ 'బాహుబ‌లి' ప్రాంచైజీ 2500 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డం..అటుపై 'ఆర్ ఆర్ ఆర్' వారంలో రోజుల్లో 1000 కోట్ల వ‌సూళ్ల‌ని సునాయాసంగా సాధించ‌డం తో తెలుగు సినిమా స‌త్తా ఏంటి? అన్న‌ది బాలీవుడ్ కి తెలిసొచ్చింది. ఆ వ‌సూళ్లు మ‌ర్చిపోక ముందే మ‌రో పాన్ ఇండియా చిత్రం 'కేజీఎఫ్ చాప్ట‌ర్-2' సంచ‌ల‌నాలు సృష్టించ‌డం బాలీవుడ్ లో మ‌రో ఎత్తుగా నిలిచింది.

వారంలోనే సినిమా 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ రెండు సినిమాల వ‌సూళ్ల‌తో ఇండియ‌న్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే సౌత్ సినిమాల గురించే ముందుగా ముచ్చ‌టించాల్సి ఉంది. అంత‌గా ఈ రెండు సినిమాలు బాలీవుడ్ పై ప్ర‌భావం చూపాయి. బాలీవుడ్ మార్కెట్ లోనే రెండు సినిమాలు మంచి వ‌సూళ్లు సాధించాయి. 'కేజీఎఫ్ -2' అక్క‌డ వంద కోట్లు వ‌సూళ్లు సాధించ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌లేదు. చాప్ట‌ర్ -1 రిలీజ్ తో ఏర్ప‌డిన హైప్ తోనే చాప్ట‌ర్ -2 ఉత్త‌రాదిన అంత పెద్ద స‌క్సెస్ సాధించింది.

'ఆర్ ఆర్ ఆర్' మొద‌ట కాస్త చ‌ప్ప‌బ‌డినా త‌ర్వాత నెమ్మ‌దిగ‌దా పుంజుకుంది. ఇక ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన 'పుష్ప ది రైజ్' హిందీ బెల్డ్ స‌క్సెస్ గురించైతే చెప్పాల్సి న ప‌నిలేదు. మొద‌ట్లో ఈసినిమాని ఉత్త‌రాది ఆడియ‌న్స్ లైట్ తీసుకున్నారు. కానీ కంటెంట్ తో అనూహ్యంగా అక్క‌డ భారీ వ‌సూళ్ల‌ని సాధించింది. ఆ ర‌కంగా మ‌రోసారి తెలుగు సినిమా స‌త్తా ప్రూవ్ అయింది. మ‌రి ఇప్పుడు ఈ మూడు చిత్రాల స‌క్సెస్ లు బాలీవుడ్ మేక‌ర్స్ స‌హా హీరోలపై తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకొచ్చాయా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ఈ మూడు స‌క్సెస్ లు చూసి బాలీవుడ్ హీరోలు..నిర్మాత‌లు మ‌న‌మెందుకు అలాంటి సినిమాలు చేయ‌లేక‌పోతున్నామ‌ని విశ్లేషించుకునే ప‌నిలో ప‌డ్డారు. మ‌న‌కు చేత‌కానిది తెలుగు వాళ్ల‌కి..క‌న్న‌డ వాళ్లికి ఎలా సాధ్య‌మ‌వుతుంద‌ని లెక్క‌లు గ‌ట్టే ప‌నిలో ప‌డ్డారు. ఈ విష‌యంలో సంజ‌య్ ద‌త్..కంగ‌నా ర‌నౌత్..క‌ర‌ణ్ జోహార్.. స‌ల్మాన్ ఖాన్.. ర‌ణ‌వీర్ సింగ్ లాంటి వారు డైరక్ట్ గానే అక్క‌డి మేక‌ర్ల‌కి చుర‌క‌లు అంటించారు.

'బాలీవుడ్ సినిమాలు సౌత్ లో రాణించ‌లేదు. కానీ అక్క‌డ సినిమాలు ఇక్క‌డ పెద్ద స‌క్సెస్ అవుతున్నాయి. ఇదెలా సాధ్యం. వాళ్ల‌లా మ‌న‌మెందుకు హీరోయిజాన్ని చూపించ‌లేక‌పోతున్నాం. మేకింగ్ విధానం మారాలి. ఇంకా ప‌వ‌ర్ ఫుల్ స‌బ్జెక్స్ట్ రావాలి" అంటూ స‌ల్మాన్ క్లాస్ పీకారు. ఇక క‌ర‌ణ్ జోహార్ " సౌత్ ని చూసి నేర్చుకోవాలి అంటూ హిందీ వాళ్ల‌కి కాస్త గ‌ట్టిగానే హిత‌బోద చేసారు. "మ‌నం ఒక‌టే ట్రెండ్ ని ప‌ట్టుకుని వెళ్లిపోతున్నాం. ఆ విధానాన్ని వ‌దిలేయాలి. కొత్త‌గా మ‌నం ట్రెండ్ సృష్టించాలి" అని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక సంజయ్ దత్ మాట్లాడుతూ..'సౌత్ లో హీరోయిజం ఎప్పుడు గొప్ప‌గా ఉంటుంది. వాళ్లు హీరో పాత్ర‌ల్నిఆలా రాయ‌డంతో పాటు..ఆన్ స్ర్కీన్ ఎలా తీసుకురావాలో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక‌ప్పుడు బాలీవుడ్ లో ఈ విధానం క‌నిపించేది. కానీ ఇప్పుడు త‌గ్గిపోయింది. ఈ విధానం మారాలి' అన్నారు. "బాలీవుడ్ కొన్నాళ్ల గా నేల విడిచి సాము చేస్తుంది. క‌థ‌ల్లో ఎమోష‌న్ మిస్ అవుతున్నారు. కానీ సౌత్ లో ఆ ఎమోష‌న్ కి పెద్ద పీట వేస్తారు. అలాంటి స‌న్నివేశాలు సౌత్ వాళ్లు బాగా తీస్తారు. వాళ్ల స‌క్సెస్ లో అది కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని" ర‌వీనా టాండ‌న్ అన్నారు.

బాలీవుడ్ లో హాలీవుడ్ పోక‌డ క‌నిపిస్తుంది. కానీ ఇది ఇక్క‌డ వ‌ర్కౌట్ అవ్వ‌దు అని ర‌వీనా అభిప్రాయప‌డ్డారు. ఇంకా కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ..."బాలీవుడ్ లో అమితాబ‌చ్చ‌న్ లాంటి గొప్ప యాంగ్రీమెన్ త‌ర్వాత అంత అగ్రెష‌న్ ని బాలీవుడ్ మేక‌ర్స్ చూపించ‌లేక‌పోతున్నారు. కానీ టాలీవుడ్ మేక‌ర్స్ ఇలాంటి వాటిలో వండ‌ర్స్ సృష్టిస్తారు. వాళ్ల గొప్ప‌త‌నం అదేన‌ని" అన్నారు.