Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : స్లీవ్ లెస్ సోకులు.. చితక్కొట్టేస్తున్న అందాలు..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 3:30 PM GMT
ఫోటో స్టోరీ : స్లీవ్ లెస్ సోకులు.. చితక్కొట్టేస్తున్న అందాలు..!
X
గ్లామర్ ఫీల్డ్ లో ఒక్కొక్కరికి ఒక్కోలా క్రేజ్ ఏర్పడుతుంది. కేవలం అభినయంతోనే కొందరు స్టార్ ఇమేజ్ తెచ్చుకోగా కొందరు గ్లామర్ ఎటాక్ తో ప్రేక్షకుల మనసులు దోచేస్తారు. అయితే ముందు గ్లామర్ షో చేయడానికి మొహమాట పడి అంతా అయ్యాక ఓ రేంజ్ లో రెచ్చిపోయినా సరే ఏమాత్రం లాభం ఉండదు. ప్రస్తుతం ఇలాంటి సేమ్ సీనే పూనం బజ్వా విషయంలో రిపీట్ అవుతుంది. ఎప్పుడో 2005లోనే మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనం అప్పటి నుంచి తన ప్రయత్నాలు తాను చేస్తున్నా కథల సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వల్ల అమ్మడు కెరియర్ లో వెనకపడ్డది.

ఎలాగోలా కెరియర్ నెట్టుకు రావాలని హీరోయిన్ గా కాకపోయినా తనకు వచ్చిన ఛాన్సులను వాడుకుంటూ వచ్చింది. ఫైనల్ గా ఇప్పటికి ఒక క్లారిటీకి వచ్చిన అమ్మడు గ్లామర్ షోతో రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. ఇదేదో అమ్మడు కెరియర్ మంచి ఫాం లో ఉన్నప్పుడు అనుకున్నా సరే స్టార్ అవకాశాలు వచ్చేవి.

అప్పట్లో గ్లామర్ షో అంటే అయ్యో నా వల్ల కాదు అన్నట్టు చెప్పుకొచ్చిన అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో వాటితోనే కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తుంది. 37 ఏళ్ల ఈ భామ తన అందాలకు గట్టిగానే పనిచెబుతుందని తెలుస్తుంది. ఇన్ స్టా లో ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది పూనం బజ్వా.

లేటెస్ట్ గా అమ్మడు సోఫాలో సోయగాల వల వేస్తుంది. బ్లూ కలర్ స్లీవ్ లెస్ జాకెట్ తో.. అదే కలర్ ప్యాంట్ ధరించిన పూనం తన టాప్ అందాలతో ఆడియన్స్ ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. తనలా మరే హీరోయిన్ చేయలేదు అన్న రేంజ్ లో తన ఫోటో షూట్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది పూనం బజ్వా. ఈమధ్యనే తన బోయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసిన అమ్మడు అతనితో కూడా క్లోజ్ గా దిగిన ఫోటోలని కూడా తన ఫాలోవర్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.

ఇంత కష్టపడుతున్న పూనం కి ఈఫర్లు ఏమైనా వస్తున్నాయా అంటే తెలుగులో ఆమె దాదాపు ఫేడవుట్ కాగా కన్నడ, మళయాళ భాషల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది పూనం.

అమ్మడి గ్లామర్ ఎటాక్ చూస్తుంటే ఈసారి తెలుగు ఆఫర్ ఎలాంటిది వచ్చినా సరే ఓకే చెప్పేందుకు రెడీ అన్నట్టు అనిపిస్తుంది. పూనం బజ్వా అందాల దాడికి సోషల్ మీడియా కూడా షేక్ అవుతుంది. అమ్మడి కష్టాన్ని గుర్తించి ఏ దర్శకుడైనా పిలిచి అవకాశం ఇస్తాడేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.