Begin typing your search above and press return to search.

మ‌రోసారి బోల్డ్ గా ఒంపుల్ని ప్ర‌ద‌ర్శించిన ఇషా

By:  Tupaki Desk   |   16 Nov 2022 11:30 AM GMT
మ‌రోసారి బోల్డ్ గా ఒంపుల్ని ప్ర‌ద‌ర్శించిన ఇషా
X
టాప్ మోడ‌ల్ కం న‌టి ఇషా గుప్తా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. గ్లామ‌ర్ షో విష‌యంలో హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగ‌డం ఈ సీనియ‌ర్ బ్యూటీ ప్ర‌త్యేక‌త‌. ఇన్ స్టా వేదిక‌గా ఇషాగుప్తా ఎప్ప‌టిక‌ప్పుడు చెల‌రేగి అందాలు ఆర‌బోస్తుంది. తాజాగా ఇషా షేర్ చేసిన బోల్డ్ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో దుమారం రేపుతోంది. ఇషాజీ మ‌రోసారి త‌న‌దైన శైలిలో చెల‌రేగారు.

ఈషా గుప్తా జెన్నీ ప్యాక్ మన్ ప్లాటినం గ్రే సీక్విన్డ్ గౌలో వజ్రంలా మెరుస్తోంది. ఫ్లోర్-లాంగ్ గౌనులో త్రీక్వార్టర్ లెంగ్త్ డ్రాప్డ్ స్లీవ్ లో గ్లామర్ ని ఆవిష్క‌రించిన‌ తీరు కుర్ర‌కారుకు మైండ్ బ్లాక్ చేస్తోంది. మోడల్ కం నటి పర్యావరణవేత్త అయిన‌ ఈషా గుప్తా న‌టిగా ఇప్ప‌టికే బాలీవుడ్ లో త‌న‌దైన ముద్ర వేసింది. తిరుగులేని ఎన‌ర్జీతో స్టైల్ ఐకాన్ గా వెలుగులు విరజిమ్ముతోంది. తన స్టైల్ పై రెగ్యులర్ అప్ డేట్ లతో ఈషా ఇప్ప‌టికే 13 మిలియన్లకు పైగా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల ఫాలోవర్ లను సంపాదించింది. ఈషా గుప్తా నిరంత‌ర‌ ఫ్యాషన్ సెన్స్ పై నేటిత‌రంలో డిబేట్లు సాగుతుంటాయంటే అర్థం చేసుకోవాలి.

తాను ఎంచుకున్న‌ది ఎత్నిక్ వేర్ అయినా... ఆరు గజాల ప‌విట కొంగుతో చీర‌లో అయినా.. అందమైన గౌనులో అయినా త‌న డ్రెస్సింగ్ సెన్స్ నుంచి క‌ళ్లు తిప్పుకోవ‌డం అంత ఈజీ కాదు. ఈషా గుప్తా జెన్నీ ప్యాక్ మన్ ప్లాటినం గ్రే సీక్విన్డ్ గౌలో ఒంపులు రంగ‌రించిన తీరుపై చ‌ర్చా సాగుతోంది.

ఇషాజీ ఫ్యాష‌న్ ప్ర‌పంచపు మ‌హారాణి. ర‌క‌ రకాల ఫ్యాషన్ దుస్తులకు స్టైలింగ్ చేస్తూ మోడ‌ల్ గా అద‌ర‌గొడుతుంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోలలో ప్రయోగాలతో పాటు కాలానుగుణ వస్త్రధారణలతో తన ఆసక్తిని తరచుగా ప్రదర్శిస్తుంది. తళతళా మెరిసే దుస్తులతో ప్ర‌తిసారీ డ్రీమ్ గాళ్ ని త‌ల‌పిస్తుంది. మెరిసే గౌనులో ఈషా మరోసారి కళ్ళు తిప్పుకోనివ్వ‌ని ట్రీటిచ్చింది. ఈసారి జెన్నీ ప్యాక్ మన్ రాక్ ల నుండి ప్లాటినం గ్రే గౌనును ఎంచుకుంది. ఆమె ఫ్లోర్-లాంగ్ గౌనులో త్రీక్వార్టర్ లెంగ్త్ డ్రెప్డ్ స్లీవ్ తో ఆక‌ట్టుకుంది. స్ట్రెయిట్ హెయిర్ నిగ‌నిగ‌ల అందాల‌తో మెరిపించింది ఇషా.

ఇషా గుప్తా టాలీవుడ్ కి సుప‌రిచితం. కానీ ఇక్క‌డ న‌టించేందుకు ఎక్కువ ప్రాధాన్య‌త‌నివ్వ‌లేదు. రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామాలో హాట్ ఐట‌మ్ నంబ‌ర్ తో క‌ట్టి ప‌డేసినా ఆ త‌ర్వాత క‌నిపించ‌లేదు. 'జ‌న్న‌త్' సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ త‌ర్వాత అక్క‌డ బాగానే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కాలేజ్ డేస్ నుంచి సినిమాలంటే ఆస‌క్తి. దీంతో ఈషా మోడ‌లింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది. చివ‌రిగా బాలీవుడ్ లో న‌టిగా స్థిర‌ప‌డింది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ సుంద‌రి పోటీల‌కు ఎంపిక‌య్యే మోడ‌ల్స్ కి ఇషా జీ శిక్ష‌ణ‌ను అందిస్తున్నారు. ఫెమీనా మిస్ ఇండియా జ‌డ్జిగానూ ఇషా కు చాలా అనుభ‌వం ఉంది. ఇటీవ‌ల బాబీ డియోల్ తో క‌లిసి 'ఆశ్రమ్ సీజన్ 2'లో ఈషా చివరిగా కనిపించింది. ప‌లు భారీ చిత్రాల‌కు ఇషా గుప్తా సంత‌కాలు చేసింది. వాటి వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.