Begin typing your search above and press return to search.
గీతా ఆర్ట్స్ లో అడుగు పెట్టడం అంత వీజీ కాదు!
By: Tupaki Desk | 28 Jun 2021 3:30 AM GMTటాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వరుస సినిమాలతో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పరిమిత బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ గీతా ఆర్ట్స్ విజయవంతమైన జర్నీని కొనసాగిస్తోంది. సినీ నిర్మాణంలో ప్లానింగ్ లో గీతా ఆర్స్ట్ చాలా పక్కగా ఉంటుంది. వరుసగా రెండు- మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే అవి పూర్తయే క్రమంలోనే కొత్త చిత్రాలు పట్టాలెక్కించే దిశగా పక్కా ప్లాన్ తో గీతా ఆర్స్ట్ టీమ్ పని చేస్తుంది.
ప్రీ ప్రొడక్షన్.. పోస్ట్ ప్రొడక్షన్... సహా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా డీల్ చేయగలిగే పర్పెక్షన్ గీతా ఆర్స్ట్ టీమ్ ప్రత్యేకత. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వాళ్ల ప్లానింగ్ కూడా అంతగా వర్కౌట్ కావడం లేదన్నది తాజా అప్ డేట్.
ప్రస్తుతం గీతా ఆర్స్ట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని...చిత్రీకరణ జరుగుతున్నవి... పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నవి.. త్వరగా పనులు పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉంది. బాలీవుడ్ లో `జెర్సీ`..` అలవైకుంఠపురంలో` చిత్రాల్ని గీతా సంస్థ రీమేక్ చేస్తోంది. అలాగే తెలుగులో `ప్రేమ కాదంట`, .. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`,... 18 పేజీస్` చిత్రాల్ని నిర్మిస్తోంది. అలాగే భారీ బడ్జెట్ తో `రామాయణం` చిత్రం ప్లానింగ్ సాగుతోంది.
అయితే ముందుగా రిలీజ్ లపై దృష్టి సారించాక.. ఇతర కొత్త ప్రాజెక్ట్ ల జోలికి వెళ్లాలని గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్ తో నిర్మించబోయే లేడీ ఓరియేంటెడ్ చిత్రం బాగా ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే గీతా ఆర్స్ట్ లో స్క్రిప్టులు వినిపించి లాక్ అయిన డైరెక్టర్లు కూడా వెయిట్ చేయాల్సిందేనట.
అయితే `రామాయణం` చిత్రం మేకింగ్ కానీ రిలీజ్ వ్యవహారం కానీ అంత ఈజీ కాదు. ఆ సినిమాని తెరకెక్కించడానికి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. రామాయణంతో ముడి పెట్టకపోయినా ఇతర సినిమాల్ని రిలీజ్ చేసి చకచకా కొత్త వాటికి లైన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. మునుముందు ప్లానింగ్ ఎలా ఉండనుంది? అన్నదానికి మరికొన్ని రోజులు ఆగితే గానీ క్లారిటీ రాదు.