Begin typing your search above and press return to search.
హాలీవుడ్ లెజెండ్ ఇండియా వస్తున్నాడహో..
By: Tupaki Desk | 27 Sep 2015 3:30 PM GMTస్టీఫెన్ స్పీల్ బర్గ్ అనే పేరు చెబితే చాలు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది సినీ ప్రియులు గుండెలు ఉప్పొంగుతాయి. ఆయనో సినిమా తీశాడంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లెజెండ్స్ అనిపించుకున్న డైరెక్టర్లు సైతం సామాన్య ప్రేక్షకుల్లా మారిపోయి థియేటర్లలో వాలిపోతారు. ప్రపంచ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో కచ్చితంగా స్పీల్ బర్గ్ పేరుంటుంది. మన దేశంలో కూడా స్పీల్ బర్గ్ ఎందరికో ఆదర్శం. ఆయన సినిమాలంటే ప్రాణం. అలాంటి లెజెండరీ డైరెక్టర్ ఇండియాకు వస్తున్నాడంటే మన అదృష్టమే.
ఈ అదృష్టం ఇంతకుముందోసారి కలిగింది. 2013లో తన ‘లింకన్’ సినిమా ప్రమోషన్ కోసం తొలిసారి ఇండియా వచ్చాడు స్పీల్ బర్గ్. ఆ సందర్భంగా వివిధ ఇండస్ట్రీల ప్రముఖులు ఆయన్ని కలిసి గొప్ప అనుభూతి పొందారు. ఆ సందర్భంగా ఇండియా ఆతిథ్యం, తనపై ఇక్కడి జనాలకు ఉన్న అభిమానం చూసి ఉప్పొంగిపోయాడు స్పీల్ బర్గ్. ఆయన చేసిన ప్రమోషన్ వల్ల ఇండియాలో ‘లింకన్’ మంచి వసూళ్లు కూడా దక్కించుకుంది. ఇప్పుడు తన కొత్త సినిమా ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పీస్’ ప్రమోషన్ కోసం మరోసారి ఇండియా వస్తున్నాడు స్పీల్ బర్గ్.
అక్టోబరు 16న విడుదల కాబోయే ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పీస్’లో టామ్ హాంక్స్ కథానాయకుడిగా నటించాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీన్ని ప్రమోట్ చేయడానికి ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో అడుగుపెడుతున్నాడు స్పీల్ బర్గ్.