Begin typing your search above and press return to search.
సినీ అభిమానులకు స్వీట్ న్యూస్!
By: Tupaki Desk | 30 July 2018 10:55 AM GMTమల్టీఫ్లెక్సులో సినిమా టికెట్టు ధర రూ.150. కానీ.. పాప్ కార్నే రూ.160. సినిమా కంటే చేతిలో ఉండే పాప్ కార్న్ రేటును భారీగా బాదేసే మల్టీఫ్లెక్సులు.. అన్ని బ్రాండుల్ని అందుబాటులో ఉంచకుండా.. ఒకట్రెండు బ్రాండ్లను ఉంచటం.. వాటిలోనూ.. స్పెషల్ ఫ్యాకేజ్డ్ పేరుతో భారీగా ధరలు పెంచేసి అమ్మటం అందరికి అనుభవమే.
రంగు రంగు లైట్ల వెలుతురులో వెలిగిపోయే మల్టీఫ్లెక్సుల్లో దీన్ని దోపిడీగా భావించని వారు చాలామందే ఉంటారు. కొన్న ప్రతిదానికి బిల్లు ఇస్తున్నప్పుడు మోసానికి తావు ఎక్కడ ఉందన్న భావన చాలామంది వ్యక్తం చేస్తుంటారు. అయితే.. అవన్నీ మోసాలని.. దర్జాగా చేసే దోపిడీ అన్న విషయాన్ని అకున్ సబర్వాల్ పుణ్యమా అని అందరికి అర్థమవుతున్న పరిస్థితి.
తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ గా వ్యవహరిస్తున్న అకున్ సబర్వాల్.. రూల్ బుక్ లో దాగున్న చట్టాలకు పట్టిన బూజు దులుపుతున్న ఆయన.. తాజాగా థియేటర్.. మల్టీఫ్లెక్సుల యజమానులకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. మల్టీఫ్లెక్సుల్లో వాటర్ బాటిల్స్ మొదలు కొని.. తినుబండారాల వరకూ అన్ని రకాలు పెట్టుకోవాలి.
ఒకే కంపెనీ వాటర్ బాటిల్ పెడతామంటే ఊరుకోమని.. రెండు.. మూడు రకాలు అందుబాటులో పెట్టటమే కాదు.. వాటి ధరలు కూడా బయటకు.. థియేటర్లకు మద్య వ్యత్యాసం అస్సలు ఉండకూడదని తేల్చి చెప్పారు.
అంతేకాదు.. పాప్ కార్న్ మొదలుకొని.. ఐస్ క్రీమ్ ల వరకూ ఇష్టం వచ్చినట్లుగా బాదేసే బాడుడుకు చెక్ చెబుతూ రూల్ బుక్ లోని ఫైన్ల లెక్కను చెప్పుకొచ్చారు. అమ్మాల్సిన దాని కంటే ఎక్కువ ధరకు అమ్మినట్లుగా రుజువైతే మొదటిసారి రూ.25వేలు.. రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే రూ.50వేలు.. మూడోసారి అయితే రూ.లక్ష జరిమానాతో పాటు.. ఆర్నెల్ల నుంచి ఏడాది వరకూ జైలుశిక్ష విధించే అవకాశం ఉందన్న వార్నింగ్ ఇచ్చేశారు.
అంతేకాదు.. ఇలాంటి పాడు పనులు చేస్తున్న థియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు సంబంధించి ఫిర్యాదులు ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబరును కూడా విడుదల చేశారు. 180042500333 - వాట్సాప్ నెంబర్ 73307 74444లకు కంప్లైంట్ చేయాలని కోరటమే కాదు.. ఈ నెంబర్లను ప్రతి మల్టీఫ్లెక్సుల్లోనూ.. థియేటర్లలోనూ ప్రముఖంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. అంతేకాదు.. పాప్ కార్న్.. ఇతర ఆహార పదార్థాలకు సంబంధించిన బరువు.. రేటును తెలిపేలా కప్పుల మీద.. ప్యాకెట్ల మీద ముద్రించేందుకు సెప్టెంబరు ఒకటి వరకూ గడువిచ్చారు. మొత్తంగా చూస్తే.. మరో రెండు రోజుల్లో ధియేటర్లు.. మల్టీఫ్లెక్సులకు వెళ్లి సినిమాలు చూసే సినీ ప్రియులకు స్వీట్ న్యూస్ గా చెప్పక తప్పదు.