Begin typing your search above and press return to search.
'ఆదిపురుష్' ఎప్పుడొచ్చినా ఒంటరిగానేనా?
By: Tupaki Desk | 28 Feb 2022 5:10 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ `ఆదిపురుష్` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రామాయణంలో ప్రతీ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాటికి `ఆదిపురుష్` రూపంలో దర్శకుడు ఓంరౌత్ దృశ్యరూపాన్ని ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అన్నది నిజంగా ఎంతో సాహసోపేతమైన నిర్ణయం. ఈ నేపథ్యంలో `ఆదిపురుష్` లో రాముడి పాత్రలో డార్లింగ్ ఎలా కనిపిస్తాడు? అని ఒకటే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని అంతకంతకు పెంచేసాయి. రిలీజ్ ఎప్పుడా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈవిషయంలో మాత్రం ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కి నిరాశ తప్పలేదు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే రోజున మిస్టర్ పర్ పెక్ట్ నిస్టు అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `లాల్ సింగ్ చద్దా` కూడా రిలీజ్ కి రెడీ అయింది. అయితే అనూహ్యంగా ఆగస్టు 11 రేసు నుంచి `ఆదిపురుష్` వాయిదా పడింది. దీంతో అమీర్ కి లైన్ క్లియర్ అయింది.
ఎలాంటి పోటీ లేకుండా `లాల్ సింగ్ చద్దా` రిలీజ్ అవుతున్న నేపథ్యంలో టీమ్ `ఆదిపురుష్` బృందానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే `ఆదిపురుష్` వాయిదాకి సరైన కారణాలు ఏంటన్నది? ఇప్పటికీ బయటకు రాలేదు. దీపావళి సందర్భంగా ఆదిపురుష్ రిలీజ్ అవుతుందని కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. తాజాగా ఈ ప్రచారంపై నా నిర్మాత భూషణ్ కుమార్ వివరణ ఇచ్చారు. ంఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ట్విస్ట్ ఇచ్చారు. రిలీజ్ తేది ఖారారు చేసిన తర్వాత అధికారికంగా మేమే ప్రకటిస్తాం. అప్పటివరకూ అంతా సమయమనంగా ఉండాలని కోరారు. దీపావళి వారాంతంలో కొన్ని సినిమాలు డేట్లను లాక్ చేసుకున్నాయి.
కాబట్టి ఆ తేదీకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసారు. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే నిర్ణయమే. ఇతర చిత్రాలకు పోటీగా రావడం ఇష్టం లేక `ఆదిపురుష్` ని వాయిదా వేస్తున్నారా? లేక టెక్నికల్ గా పూర్తికావాల్సిన పనులు ఆలస్యం కావడం వల్ల డిలే చేస్తున్నారా? అన్న దానిపై స్ఫష్టత లోపిస్తోంది. ఒకటి మాత్రం ఇక్కడ క్లారిటీ దొరికింది. ముందు లాక్ చేసిన తేదీకి `లాల్ సింగ్ చద్దా` రిలీజ్ అవ్వడం..అలాగే దీపావళి రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రాల జాబితాని చూస్తే `ఆదిపురుష్` ఎప్పుడు రిలీజ్ అయినా పోటీ లేకుండా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందన్నది స్పష్టంగా ఉంది.
`ఆదిపురుష్` కోసం 7000 సంవత్సరాల క్రితం నాటి సెట్లు సైతం నిర్మించారు. రామాయణానికి సంబంధించిన ప్రతీ పాయిట్ ని సినిమాలో టచ్ చేసారు. దానికి ఆధునిక సాంకేతికను జోడించి తమదైన శైలిలో తెరకెక్కించినట్లు దర్శకుడు ఓరౌంత్ వెల్లడించారు. సినిమా నిర్మాణ పరంగానూ భారీగానే ఖర్చు అయింది. నిర్మాతలు ఖర్చు పరంగా ఎక్కడా రాజీకి రాలేదు. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. సీత పాత్రని కృతి సనన్ పోషిస్తోంది. ఇంకా ఎంతో మంది బిగ్ స్టార్స్ `ఆదిపురుష్` లో భాగమయ్యారు.