Begin typing your search above and press return to search.

మొదటి ముద్దుకోసం ఊరిస్తాను

By:  Tupaki Desk   |   13 Dec 2020 4:13 AM GMT
మొదటి ముద్దుకోసం ఊరిస్తాను
X
బాలీవుడ్‌ లో ప్రస్తుతం కియారా అద్వానీ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీ అర్జున్‌ రెడ్డి సినిమాతో భారీ క్రేజ్‌ ను దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం అయిదు ఆరు సినిమాలు నటిస్తోంది. హిందీలో ఈమె నటిస్తున్న సినిమాలు వచ్చే ఏడాది వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇటీవలే ఈమె నటించిన లక్ష్మి సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పలు సినిమాలు వచ్చే ఏడాది ఆరంభం నుండే విడుదల కాబోతున్నాయి. తాజాగా ఒక మీడియా సంస్థతో ఈ అమ్మడు మాట్లాడుతూ పలు విషయాలను వెళ్లడించింది.

చిన్నతనంలోనే నన్ను నా కుటుంబ సభ్యులు అబ్బాయిల విషయంలో దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టమన్నారు. ఆ సమయంలో ఒక అబ్బాయితో చాలా క్లోజ్‌ గా ఉన్న నేను అతడికి దూరం అయ్యాను. అప్పుడే నా గుండె బద్దలయ్యింది. అతడిని కలిసేందుకు నా ఫ్యామిలీ ఒప్పుకునేది కాదు. ఆ సమయంలో చాలా బాధ పడ్డాను. ఇక డేటింగ్‌ కు నచ్చిన వారితో వెళ్లాలి. అయితే నేను ఫస్ట్‌ టైం డేట్‌ కు వెళ్లినప్పుడు ముద్దు ఇవ్వను. అతడు నా వెంట పడేలా చేసుకుంటాను. ఊరించి అతడితో బతిమిలాడించుకున్న తర్వాత ముద్దు ఇస్తాను అంటూ కియారా చెప్పుకొచ్చింది.