Begin typing your search above and press return to search.

రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు తీయడం ఆపేయండి మాస్టారూ..!

By:  Tupaki Desk   |   14 May 2021 2:30 PM GMT
రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు తీయడం ఆపేయండి మాస్టారూ..!
X
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఏటా ఈద్ కానుకగా తన సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సల్మాన్ కు ఈద్ పెద్దగా కలిసి రాలేదు. ఈ క్రమంలో ఈసారి ఈద్ కి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ''రాధే'' సినిమాతో వచ్చాడు. కాకపోతే ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల కారణంగా 'పే ఫర్ వ్యూ' విధానంలో ఈ చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశాడు. అయితే 'రాధే' చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు విశ్లేషకులు ప్లాప్ సినిమా అని తేల్చేశారు. ఫ్యాన్స్ సైతం తీవ్ర నిరాశ చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్య కారణం డైరెక్టర్ ప్రభుదేవా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

కొరియన్ రీమేక్ అని చెప్పి దశాబ్దాల నుంచి చూస్తున్న రొటీన్ మాస్ మసాలా సినిమానే తమ హీరోతో చేసి ప్రభుదేవా డిజప్పాయింట్ చేశాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎంత సేపూ సల్మాన్ ఎలివేషన్స్ మీదే దృష్టి పెట్టి కథ - కథనం గాలికొదిలేసాడని ప్రేక్షకులు అంటున్నారు. సిల్లీగా అనిపించే యాక్షన్ ఎపిసోడ్స్ తో.. లాజిక్ లేని బోరింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని ప్లాప్ దిశగా నడిపించాడని ఓటీటీ ఆడియన్స్ తీర్పు ఇచ్చేశారు.

వాస్తవానికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో దర్శకుడిగా మారిన డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా.. ఆ తర్వాత రీమేక్ సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 'ఆర్.రాజ్ కుమార్' 'యాక్షన్ జాక్షన్' 'సింగ్ ఈజ్ బ్లింగ్' 'దబాంగ్ 3' వంటి2 వరుస రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీసి నిరాశపరిచాడు. 'దబాంగ్ 3' డిజాస్టర్ అయినా వెంటనే సల్మాన్ మరో సినిమాకి అవకాశం ఇచ్చాడు అంటే ''రాధే'' లో ఏదో ఉండబోతుంది అని అందరూ2 ఆశించారు. తీరా సినిమా చూశాక రూ. 249 ప్లస్ జీఎస్టీ తో పాటుగా టైం వేస్ట్ చేసుకున్నామని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలు తీయడం ఆపేయాలని సోషల్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ కమ్ డ్యాన్స్ మాస్టర్ ని వేడుకుంటున్నారు.

ఇకపోతే 'రాధే' సినిమా IMDB లో చెత్త రేటింగ్ అందుకున్న సినిమాల జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రం 2.5 రేటింగ్స్ తో సల్మాన్ కెరీర్ లో వరస్ట్ రేటింగ్ పాయింట్స్ సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. కాగా, 'రాధే' చిత్రంలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా.. రణదీప్‌ హుడా విలన్ గా నటించారు. జాకీ ష్రాఫ్‌ - 'ప్రేమిస్తే' భరత్ - మేఘా ఆకాష్ ఇతర పాత్రలు పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పెషల్ సాంగ్ లో కనిపించింది.