Begin typing your search above and press return to search.
చిన్నోడు అయినా ఇది పెద్ద ఘనతే
By: Tupaki Desk | 6 April 2018 4:22 AM GMTకేరాఫ్ కంచరపాలెం అంటూ ఓ తెలుగు సినిమా రూపొందింది. ఈ సినిమాలో నటించిన వారు కానీ.. దర్శకుడు కానీ.. ఎవరూ బాగా పేరు గడించిన వాళ్లేమీ కాదు. అయినా సరే.. ఇప్పుడీ సినిమా న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపిక అయింది. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది.
విజయవాడలో పుట్టి పెరిగిన వెంకటేష్ మహా.. ఆ తర్వాత విశాఖలోనూ నివసించాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం ఉన్న వెంకటేష్.. చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో తనకో స్థానం కోసం పాకులాడాడు. విశాఖలో ఉంటున్న సమయంలో కంచరపాలెంలో నివసించిన వెంకటేష్ మహా.. అక్కడి వ్యక్తులను పరిశీలించడం ప్రారంభించాడు. అలా మొదట అక్కడి వారితో వీడియో బైట్స్ తీసుకుంటూ చిన్న వీడియో రూపొందించాడు. సినిమా కోసం క్రౌడ్ ఫండింగ్ చేయాలనే అతడి ఆలోచన. అయితే ఈ వీడియోను చూసి అపర్ణ మల్లాది.. ఇతడిని ప్రవీణ్ పరుచూరికి పరిచయం చేశారు. ఆయన నిర్మాణం వహించేందుకు అంగీకరించగా.. కేరాఫ్ కంచరపాలెం మొదలైంది.
ఈ సినిమాలో 80 మంది ఆర్టిస్టులు ఉండగా.. 4గురు మినహాయించి అందరూ కంచరపాలెం స్థానికులే కావడం విశేషం. పూర్తిగా విశాఖలోనే రూపొందిన ఈ సినిమాను 63 రోజులలో రూపొందించగా.. వెంకటేష్ దగ్గుబాటి ఓసారి ఈ సినిమాను చూడడం జరిగింది. సురేష్ బాబుకు వెంకీ రిఫర్ చేయగా.. ఈ చిత్రాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు ఆయన యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత గోవా ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లిన వెంకటేష్ మహా.. అసీం చాబ్రాను తన కేరాఫ్ కంచరపాలెం చూడాల్సిందిగా కోరాడు.
ఓ కాపీ పంపమని కోరిన ఆయన.. న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కు రిఫర్ చేశాడు. అలా రిలీజ్ కు ముందే సినిమా పండుగకు కేరాఫ్ కంచరపాలెం వెళుతోంది. ప్రస్తుతం వీసా ప్రక్రియలో ఉన్నానని చెబుతున్న వెంకటేష్ మహా.. అది పూర్తయిన తర్వాత ఇక్కడ విడుదల కార్యక్రమాలలో సురేష్ బాబుతో కలిసి పాల్గొంటాడట.