Begin typing your search above and press return to search.
ఆ దేవుడి ఆశీస్సులతోనే కృష్ణ..విజయనిర్మల పెళ్లి!
By: Tupaki Desk | 27 Jun 2019 4:26 AM GMTకొన్ని ఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా చెప్పేది కూడా అలాంటిదే. ఎక్కువ చిత్రాల్లో జంటగా నటించిన కృష్ణ.. విజయనిర్మలది హిట్ పెయిర్ గా అనుకునేవారు. ఇలాంటి పెయిర్స్ సినిమా ఇండస్ట్రీలో చాలానే ఉంటాయి. అయితే.. రీల్ లైఫ్ లో హిట్ అయినా.. రియల్ లైఫ్ లో ఎవరికి వారే అన్నట్లు ఉంటారు. ఇందుకు మినహాయింపుగా కృష్ణ.. విజయనిర్మలను చెప్పాలి.
గోదావరి తీరంలోని పులిదిండి గ్రామంలో ఉన్న మీసాల కృష్ణుడి గుడి ఉంది. ఈ గుడిలో కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అందుకే మీసాల కృష్ణుడన్న పేరు వచ్చింది. ఆయనకు చాలా పవర్ ఫుల్ గాడ్ గా అక్కడి వారి నమ్మకం. ఏం అనుకుంటే అది జరుగుతుందన్న పేరుంది. బాపు రమణలు దర్శకత్వంలో సాక్షి చిత్రాన్ని నిర్మించారు.
ఇందులో కృష్ణ.. విజయనిర్మల జంటగా నటించారు. ఈ సినిమా కోసం ప్రముఖ కవి ఆరుద్ర రాసిన అమ్మ కడుపు చల్లగా.. అత్త కడుపు చల్లగా.. బతకరా పచ్చ పచ్చగా అనే పాటను కృష్ణ.. విజయనిర్మల మీద తీశారు. ఈ పాట షూటింగ్ లో భాగంగా వీరిద్దరిని పెళ్లిబట్టల్లో.. కొత్త దంపతులుగా చిత్రీకరించారు. వారి కొంగులు ముడి వేసి ఆ గుడిలోనే షూట్ చేశారు.
ఆ గుడి మహత్యం తెలిసిన ప్రముఖ హాస్య నటుడు రాజబాబు ఛలోక్తిగా.. ఇక్కడి మీసాల కృష్ణుడు చాలా పవర్ ఫుల్.. ఇక్కడ అనుకున్నవి నిజమవుతాయని వ్యాఖ్యానించారట. ఆయన మాట నిజం చేస్తూ..ఈ షూటింగ్ జరిగిన రెండేళ్లకే రియల్ లైఫ్ లో కృష్ణ.. విజయనిర్మల ఒక్కటయ్యారు. అలా కలిసిన వారు కలిసే ఉన్నారు. తాజాగా అనారోగ్యంతో విజయనిర్మల కన్నుమూయటం తెలిసిందే.