Begin typing your search above and press return to search.

​రంగస్థలం నాటకాల గురించి కాదులే

By:  Tupaki Desk   |   11 Jun 2017 8:01 AM GMT
​రంగస్థలం నాటకాల గురించి కాదులే
X
రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం ఇప్పుడు టాలీవుడ్ లో కోలాహలం చేస్తోంది. సినిమా పోస్టర్ విడుదల చేసినప్పుడు నుండి ఈ సినిమా పై పాజిటివ్ టాక్ వచ్చిందిలే. అభిమానులు కూడా పోస్టర్ ను ఆకాశానికి ఎత్తేశారు. రామ్ చరణ్ కూడా పల్లెటూరు యువకుడి తరహా స్కెచ్ లో కావిడ భుజాన మోస్తూ కనిపించే తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా 80వ దశకం లో జరిగే ఒక ప్రేమ కథ గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నారు.

ఈ సినిమా పేరు రంగస్థలం 1985 అని పెట్టినప్పటి నుండి ఆ సినిమా కథ పై రకరకాల మాటలు అనుకుంటున్నారు కథ గురించి. రంగస్థలం (ఇంగ్లీషులో స్టేజ్) అనే పదం అప్పటిలో నాటకాలు వేసే వారు వాడేవాళ్లు కాబట్టి ఈ సినిమాలో చరణ్ ఒక వీది నాటకులు వేసే కుర్రాడుగా కనిపిస్తాడు అని ఒక ముచ్చట ఉంది. అయితే ఈ సినిమాకు పనిచేసే వాళ్ళు చెప్పినదాని ప్రకారం ఇది ఒక ఊరి లో జరిగే ప్రేమ కథ అని ఈ సినిమాలో రంగస్థలం అనే పదం కథలో ఒక భాగం కాబట్టి, రంగస్థలం అనే శబ్దం సినిమా కథ గురించి పుస్తకాలలో ముందు ఉండే ముందుమాటలా ఉంటుందని అలా పెట్టారట. ఈ సినిమాలో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న వాడులా కనిపించబోతున్నాడట.

రామ్ చరణ్ కు జోడిగా సమంత నటిస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రంగస్థలం సినిమాకు సుమారుగా 55 కోట్లు ఖర్చు పెడుతునట్లు సమాచారం. ఈ సినిమాకు మ్యూజిక్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మన పల్లెలాంటి ప్రేమ కథ తెలుగు సంక్రాంతి 2018 లో విడుదల అవుతుంది. ​


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/