Begin typing your search above and press return to search.

టూత్ పిక్ వెనుక స్టోరీ అదేనట

By:  Tupaki Desk   |   3 May 2018 5:32 AM GMT
టూత్ పిక్ వెనుక స్టోరీ అదేనట
X
కాలం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు అప్గ్రేడ్ అవుతున్నారు. ముఖ్యంగా మన టాలీవుడ్ లో అయితే ఊహించని విదంగా కొత్త తరహా మార్పులు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ కి సరిపడా కలెక్షన్స్ కొల్లగొట్టడంలోనే కాకుండా స్టైల్ లో కూడా మన స్టార్స్ సరికొత్తగా ట్రై చేస్తున్నారు. మెయిన్ గా చెప్పుకోవాల్సిన విషయం.. ప్రమోషన్స్. గత కొంత కాలంగా ప్రచారాల హడావుడి చాలా పెరుగుతోంది.

చిన్నా పెద్దా హీరోలని కాకుండా దాదాపు అందరు సినిమా ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంటున్నారు. ఎవరి స్టైల్ లో వారు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుండడం అభినందించాల్సిన విషయం. ముఖ్యంగా ఇప్పటి హీరోల్లో విజయ్ దేవరకొండ తనదైన శైలిలో చిత్ర ప్రమోషన్స్ లో బాగమవుతున్నాడు. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా నోట్లో టూత్ పిక్ తో కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో మందు సిగరెట్ అంటూ తన క్యారెక్టర్ తో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ హీరో నెక్స్ట్ టాక్సీ వాలా సినిమాలో తన పాత్ర బుద్ధిమంతుడు అనే తరహాలో ఉంటుందని చెప్పకనే చెబుతున్నాడు.

తన పాత్ర ఎలా ఉంటుందో ఇటీవల ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పేసిన సంగతి తెలిసిందే. పిల్లలు సిగరెట్ తీసేసి టూత్ పిక్ పెట్టడంతో అదే ఫాలో అవుతున్నాడు. ఈ తరహాలో చేయడం బాలీవుడ్ సెలబ్రెటీలకు అలవాటే సినిమాలకు సంబంధించిన వేడుకలకు వెళితే ఎదో ఒక విధంగా తమ నెక్స్ట్ సినిమా పాత్రలకు సంబంధించిన విధంగా కనిపిస్తుంటారు. విజయ్ కూడా అదే తరహాలో దర్శనమివ్వడం చూస్తుంటే సినిమా అంటే మనోడికి ఎంత పిచ్చో అర్థమవుతూనే ఉంది.