Begin typing your search above and press return to search.

వెండితెర‌పై స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి క‌థ‌!

By:  Tupaki Desk   |   11 Aug 2022 5:21 AM GMT
వెండితెర‌పై స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి క‌థ‌!
X
వెండితెర‌పై మ‌రో బ‌యోపిక్ రాబోతోంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు.. తొలి యువ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఖుదీరామ్ బోస్ జీవిత క‌థ‌ని వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ తెర‌పై ఎంతో మంది ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ల క‌థ‌లు రూపొందాయి. అందులో చాలా వర‌కు దేశ భ‌క్తిని ప్ర‌బోధిస్తూ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి. అదే బాట‌లో తొలి త‌రం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, యంగెస్ట్ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ ఆఫ్ ఇండియా ఖుదీరామ్ బోస్‌ జీవిత క‌థ ఆధారంగా అదే పేరుతో ఓ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కిస్తున్నారు.

ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్ ని భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు విడుద‌ల చేశారు. ఈ మూవీ ద్వారా రాకేష్ జాగ‌ర్ల‌మూడి తెరంగేట్రం చేస్తున్నారు. 1889లో పుట్టిన ఖుదీరామ్ బోస్ బ్రీటీష్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన అత్యంత చిన్న‌వ‌యసు వాడైన స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడుగా చ‌రిత్ర‌లో నిలిచిపోయాడు. బ్రిటీష్ ప్ర‌భుత్వం చేత దోషిగా ప‌రిగ‌ణింప‌బ‌డి 1908, ఆగ‌స్టు 11న‌ మ‌ర‌ణ శిక్ష‌కు గుర‌య్యాడు. ఇది ముజాఫ‌రాపూర్ కుట్ర కేసుకు సంబంధించిన చ‌రిత్ర కారుల‌కు సుప‌రిచిత‌మే.

కానీ చ‌రిత్ర‌లో ఈ పోరాట యోధుడి గురించి పెద్ద‌గా ప్ర‌స్తావించలేదు. అలాంటి చ‌రిత్ర మ‌రిచిన పోరాట యోధుడి జీవిత క‌థ ఆధారంగా 'ఖుదీరామ్ బోస్‌'ని తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఖుదీరామ్ బోస్ కు మ‌ర‌ణ శిక్ష విధించిన ఆగ‌స్టు 11నే ఆయ‌న జీవిత క‌థ తో తెర‌కెక్కిస్తున్న సినిమాని చిత్ర బృందం ప్ర‌క‌టించారు. గోల్డెన్ రెయిన్ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ పై జాగ‌ర్ల‌మూడి పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జిత విజ‌య్ జాగ‌ర్ల‌మూడి ఈ మూవీని నిర్మిస్తున్నారు. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

'ఇది చ‌రిత్ర‌లో దాగిన ఓ ర‌త్నంకు సంబంధించిన పోరాటం'అని మేక‌ర్స్ గురువారం వెల్ల‌డించారు. తెలుగుతో పాటు ఈ మూవీని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, బెంగాలీ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

రాకేష్ జాగ‌ర్ల‌మూడి ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ గా భావిస్తూ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ మూవీలో వివేక్ ఓబెరాయ్‌, అతుల్ కుల‌క‌ర్ణి, ర‌విబాబు, కాశీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మ‌ణిశ‌ర్మ‌, ఫొటోగ్ర‌ఫీ ర‌సూల్ ఎల్లోర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ప‌ద్మ‌శ్రీ తోట త‌ర‌ణి, యాక్ష‌న్ క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌, ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంక‌టేష్‌, డైలాగ్స్ బాలాదిత్య‌.