Begin typing your search above and press return to search.
`డిసెంబరు` సెంటిమెంట్ పై నాగ్ క్లారిటీ!
By: Tupaki Desk | 17 Dec 2017 6:45 AM GMTబాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్....ఇలా ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లకు రకరకాల సెంటిమెంట్లుంటాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్...ప్రతి ఏడాది రంజాన్ సందర్భంగా ఓ సినిమాను విడుదల చేసి తన అభిమానులకు `ఈదీ`(పండుగ బహుమతి)ని ఇస్తుంటాడు. టాలీవుడ్ లో బాలయ్య బాబు దాదాపు ప్రతి సంక్రాంతికి ఓ సినిమాను విడుదల చేసి హిట్ కొడుతుంటాడు. అదే తరహాలో అక్కినేని ఫ్యామిలీకి `డిసెంబరు` సెంటిమెంటు ఉంది. నాగ్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ కొన్ని డిసెంబరులోనే విడుదలయ్యాయి. అదే సెంటిమెంట్ ను ఫాలో అయిన నాగ్ ...అఖిల్ రెండో సినిమా `హలో`ను డిసెంబరులో క్రిస్మస్ కానుకగా అందించబోతున్నాడు. అయితే, అసలు ఈ డిసెంబరు సెంటిమెంట్ వెనుక ఉన్న సీక్రెట్ ను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రివీల్ చేశాడు.
సాధారణంగా నాగ్ పెద్దగా సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు కనిపించడు. అయితే, డిసెంబరు సెంటిమెంటును ఫాలో అవుతానని నాగ్ స్వయంగా చెప్పాడు. 2003 సంక్రాంతి బరిలో చాలా సినిమాలున్నాయని, ఆ కారణంతో ‘మన్మథుడు’ ను డిసెంబర్లో రిలీజ్ చేశాన్నారు. ఆ సినిమా ఘన విజయం సాధించిందని, అనుకోకుండా డిసెంబర్లో విడుదలైన ‘మాస్’ కూడా హిట్ అయిందన్నాడు. తాను నిర్మించిన ‘సత్యం’ సినిమా కూడా డిసెంబర్లో విడుదలై సుమంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిందన్నాడు. నాన్నగారు పూర్తి స్థాయి హీరోగా నటించిన తొలి సినిమా కూడా 1944లో డిసెంబరు నెలలోనే రిలీజైందని చెప్పారు. నాన్నగారి అభిమాని పంపిన ఓ గ్రీటింగ్ ద్వారా ఆ విషయం తెలిసిందన్నారు. దీంతో, అనుకోకుండానే అక్కినేని ఫ్యామిలీకి డిసెంబరు సెంటిమెంటు అయిందన్నాడు. అయితే, సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్. బాలకృష్ణ లాంటి పెద్ద హీరోలతో అఖిల్ పోటీ పడితే బాగోదన్న కారణంతోపాటు డిసెంబర్ సెంటిమెంట్ తోనే `అఖిల్` ను విడుదల చేస్తున్నామన్నారు. దాంతోపాటు, క్రిస్మస్ వీకెండ్ లో వరుసగా 4 రోజులు సెలవులుండటంతో డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి 21న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నాగ్ తెలిపాడు.