Begin typing your search above and press return to search.

వీరభోగ వసంత రాయలు కథేంటి?

By:  Tupaki Desk   |   25 July 2018 8:33 AM GMT
వీరభోగ వసంత రాయలు కథేంటి?
X
నారా రోహిత్.. శ్రియ సరన్.. సుధీర్ బాబు.. శ్రీ విష్ణుల వెరైటీ కాంబినేషన్లో తెలుగులో ‘వీర భోగ వసంత రాయలు’ పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే లాంచ్ అయిన శ్రియ.. నారా రోహిత్ ల లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇదొక ఇంటెన్స్ మూవీ అనే సంకేతాల్ని ఆ లుక్స్ స్పష్టం చేశాయి. ఐతే ఈ చిత్ర టైటిల్.. దీని కాంబినేషన్ చూస్తే ఇది ఎలాంటి సినిమా.. దీని కథేంటి అనే విషయాల్లో జనాలకు ఏ ఐడియా రావట్లేదు. ఐతే ఈ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం తెలుగులో ఇప్పటిదాకా రాని ఒక వెరైటీ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందట. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ‘కాలజ్ఞానం’ ఆధారంగా ఈ కథను దర్శకుడు ఇంద్రసేన తీర్చిదిద్దుకున్నట్లు తెలుస్తోంది.

వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో వీరభోగ వసంత రాయలు ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. భవిష్యత్తులో రాబోయే అనూహ్య మార్పుల గురించి అందులో ప్రస్తావిస్తాడు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన చెప్పిన విషయాల్లో కొన్ని నిజమయ్యాయి. మరి కొన్ని నిజం కాలేదు. ఈ కాలజ్ఞానాన్ని ఇప్పటి కాలానికి ముడిపెట్టి ఈ కథను తయారు చేశాడట ఇంద్రసేన. ఇదొక ఫాంటసీ మూవీ అని అంటున్నారు. కానీ చాలా మోడర్న్ గా సాగుతుందట. ప్రధాన పాత్రలన్నీ చాలా కొత్తగా ఉంటాయని.. దేనికవే ప్రాధాన్యం చాటుకుంటాయని చెబుతున్నారు. అప్పారావు బెల్లన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే సుధీర్ బాబు.. శ్రీవిష్ణుల లుక్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రమోషన్లు జోరుగా చేసి సెప్టెంబరులో ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.