Begin typing your search above and press return to search.

స్ట్రేంజ్ వరల్డ్ ట్రైల‌ర్: అక్క‌డ అన్నీ వింత‌లే

By:  Tupaki Desk   |   23 Nov 2022 11:08 AM GMT
స్ట్రేంజ్ వరల్డ్ ట్రైల‌ర్: అక్క‌డ అన్నీ వింత‌లే
X
యానిమేటెడ్ బొమ్మ‌ల‌కు క‌ద‌లిక‌లు ఇచ్చి పాత్ర‌ల‌కు జీవం పోసి ఒక అంద‌మైన చంద‌మామ క‌థ‌లా అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా కుర్చీ అంచున కూచుని వీక్షించ‌గ‌లిగేంత సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు లోను చేస్తూ మ‌రో కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే యానిమేష‌న్ సిరీస్ ల‌కు కొద‌వేమీ లేదు. హాలీవుడ్ లో పాపుల‌ర్ ఫ్రాంఛైజీల నుంచి యానిమేష‌న్ సినిమా కేట‌గిరీలో ఆస్కార్ లు కొల్ల‌గొడుతున్నవి ఎన్నో. వెరైటీ వెరైటీ క‌థ‌లు వింతైన‌ పాత్ర‌ల‌తో అద్భుతాల్ని సృజిస్తున్నారు. కొన్ని పాపుల‌ర్ ఫ్రాంఛైజీ యానిమేటెడ్ సినిమాల్లో అద్భుత ప్ర‌పంచాల‌ను చూసి అస‌లు ఈ భూప్ర‌పంచానికి స‌మాంత‌రంగా ఇలాంటి మ‌రిన్ని ప్రపంచాలు మ‌నుగ‌డ‌లో ఉంటే ఎంతో బావుంటుందో క‌దా అని కూడా అనిపిస్తుంది. అంత అంద‌మైన క‌థ‌ల్ని తెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు.

అదే కేట‌గిరీలో మ‌రో యానిమేటెడ్ సినిమా డిస్నీ నుంచి వ‌స్తోంది. డిస్నీ అంటేనే ఒక స్టాండార్డ్. ప్ర‌పంచ వీక్ష‌కుల్ని మెప్పించే ప్ర‌మాణాల‌తో ఈ సంస్థ నుంచి సినిమాలొస్తాయి. ఇప్పుడు వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ అడ్వెంచర్ 'స్ట్రేంజ్ వ‌ర‌ల్డ్' నవంబర్ 25న భారతదేశంలో థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ లో టైటిల్ కి త‌గ్గ‌ట్టే స‌రికొత్త వింత ప్ర‌పంచాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆవిష్క‌రించారు. ఈ వింత‌ ప్ర‌పంచంలో సామాన్యుల ప్ర‌వేశం అనంత‌రం ఎలాంటి స‌న్నివేశం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా తెర‌పై ఆవిష్క‌రించారు. ఇందులో ఒక‌ భారీ మెషీన్ పాత్ర కూడా ఆస‌క్తిని క‌లిగించింది.

డిస్నీ స్ట్రేంజ్ వరల్డ్ అన్వేషకుల పూర్వీకుల‌ కుటుంబాన్ని పరిచయం చేసిన తీరు ఈ ట్రైల‌ర్ లో ఆస‌క్తిని క‌లిగిస్తుంది.. క్లాడ్స్.. అత‌డి మోట్లీ సిబ్బందితో పాటు ఇంత‌వ‌ర‌కూ బాహ్య ప్ర‌పంచం గుర్తించని ప్రమాదకరమైన భూమిని నావిగేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇందులో స్ప్లాట్ అనే అమీబా త‌ర‌హా జీవి.. లెజెండ్ అనే మూడు కాళ్ల కుక్క .. ఇతర క్రూరమైన జీవులు ఉన్నాయి.

ఆక్టోప‌స్ త‌ర‌హా ప్ర‌మాద‌క‌ర జీవులు వెంట‌ప‌డి త‌రిమికొడుతుంటే వాటి నుంచి బ‌య‌ట‌ప‌డే సాహ‌సాల‌ను తెర‌పై ఆవిష్క‌రించారు. డాన్ హాల్ సహ-దర్శకుడు/రచయిత క్విన్గుయెన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాయ్ కాన్లీ నిర్మించారు. క్లాడ్ పాత్ర‌కు జేక్ గిల్లెన్ హాల్ స్వరాన్ని అందించారు. జేగర్ గా డెన్నిస్ క్వాయిడ్... ఏతాన్ గా జబౌకీ... యంగ్-వైట్.. గాబ్రియెల్ యూనియన్ మెరిడియన్ క్లాడ్ గా - లూసీ లియు కాలిస్టో మాల్ గా స్వ‌రాల‌ను అందించారు.

తాజాగా ఓ వర్చువల్ గ్లోబల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో డిస్నీ 'స్ట్రేంజ్ వ‌ర‌ల్డ్' బృందం ఈ చిత్రంలో పాత్రలు ఎలా రూపొందాయి? అనే దాని గురించి చర్చించారు. విలేకరుల సమావేశానికి హాజరైన వారిలో జేక్ గిల్లెన్ హాల్... గాబ్రియెల్ యూనియన్.. డెన్నిస్ క్వాయిడ్... జబౌకీ యంగ్-వైట్, డాన్ హాల్... క్వి న్గుయెన్ .. రాయ్ కాన్లీ ఉన్నారు. ఫిలింమేక‌ర్స్ జేక్ గిల్లెన్ హాల్ - గాబ్రియెల్ యూనియన్ డిస్నీ కుటుంబ సాహసంలో ఈ పాత్రలు ఎలా రూపుదిద్దుకున్నాయో ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా చర్చించారు.

ఇది ఈథర్ నుండి వచ్చిన కథ కాదు...వ్యక్తిగత అనుభవాల నుండి నేరుగా వచ్చిన క‌థ‌. కాబట్టి ఇది అద్భుతంగా తెర‌కెక్కింద‌ని మేక‌ర్స్ వెల్లడించారు. సంవత్సరం పాటు మేమంతా కలిసి పని చేసాం. పాత్రలు నిజంగా ఆకృతిని పొందడానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది.. అని తెలిపారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.