Begin typing your search above and press return to search.

ధ‌మ్కీతో స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ కి రెడీ!

By:  Tupaki Desk   |   19 Nov 2022 1:30 PM GMT
ధ‌మ్కీతో స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ కి రెడీ!
X
`మెంట‌ల్ మ‌ది`లో మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ప్ర‌వేశించిన మ‌ధురై బ్యూటీ నివేదా పేతురాజ్‌. త‌మిళ సినిమా `ఒరు నాల్ కోతు`తో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా టాలీవుడ్ వైపే మొగ్గు చూపుతూ ఇక్క‌డే సినిమాలు చేస్తూ వ‌స్తోంది. శ్రీ‌విష్ణుతో క‌లిసి చేసిన `మెంట‌ల్ మ‌దిలో` మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. కానీ స‌క్సెస్ ని మాత్రం సొంతం చేసుకోలేక‌పోయింది. దీంతో మ‌ళ్లీ త‌మిళంలోనే కంటిన్యూ అవుతూ వ‌చ్చింది.

సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన `చిత్ర‌ల‌హ‌రి`తో మ‌ళ్లీ టాలీవుడ్ లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం మొద‌లు పెట్టింది. ఈసారి ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఈ మూవీ స‌క్సెస్ అయింది. అయితే ఇందులో నివేదా పేతురాజ్ మెయిన్ హీరోయిన్ కాదు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిని మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తే నివేదా పేతురాజ్ సెకండ్ హీరోయిన్ గా క‌నిపించింది.

ఈ సినిమా అందించిన స‌క్సెస్ తో కోలీవుడ్ కు రాం రాం చెప్పేసి టాలీవుడ్ కే ప‌రిమిత‌మైపోయింది. బ్రోచే వారెవ‌రురా, అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో`, రామ్ న‌టించిన `రెడ్‌` వంటి సినిమాల్లోనూ సెకండ్ హీరోయిన్ గా ఎలాంటి ప్రాధాన్య‌త‌లేని పాత్ర‌ల్లో న‌టించింది. ఫైన‌ల్ గా మాస్ కా దాస్ న‌టించిన `పాగ‌ల్` సినిమాలో మెయిన్ హీరోయిన్ గా న‌టించింది. అయితే ఈ మూవీ స‌క్సెస్ ని అందించ‌లేక‌పోయింది.

చందూ మొండేటి ఆహా ఓటీటీ కోసం తెర‌కెక్కించిన క్రైమ్ డ్రామా `బ్ల‌డీ మోరీ`లో సోలోగా క‌నిపించి ఆక‌ట్టుకుంది. ఎంత‌కూ కెరీర్ గాడిన ప‌డ‌క‌పోవ‌డంతో సాఫ్ట్ గా వుండ‌టం వ‌దిలేసి గ్లామ‌ర్ తో `ధ‌మ్కీ` ఇవ్వ‌డానికి రెడీ అయిపోయింది. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌కత్వంలో రూపొందిస్తున్న `దాస్ కా ధ‌మ్కీ` సినిమాతో మెయిన్ హీరోగా త‌న‌దైన గ్లామ‌ర్ తో కొత్త జ‌ర్నీకి రెడీ అయిపోతోంది.

రీసెంట్ గా విడుద‌ల చేసిన `దాస్ కా ధ‌మ్కీ` ట్రైల‌ర్ లో నివేదా పేతురాజ్ త‌న‌దైన గ్లామ‌ర్ హోయ‌ల‌తో షాకివ్వ‌డం తో అంతా అవాక్క‌వుతున్నారు. ఈ మూవీతో గ్లామ‌ర్ డాల్ గా కొత్త జ‌ర్నీకి రెడీ అయిపోతున్న నివేదా పేతురాజ్ కు టాలీవుడ్ లో ఈ మ‌రిన్ని అవ‌కాశాలు పెర‌గ‌డం గ్యారంటీ అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.