Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ లేకుండా మళ్లీ స్టూడెంట్ నెం 1
By: Tupaki Desk | 11 Dec 2016 11:19 AM GMTస్టూడెంట్ నెం. 1.. టాలీవుడ్ కి ఇదో మెమరబుల్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రెండో సినిమానే అయినా.. బ్లాక్ బస్టర్ గా నిలిచి.. బుడ్డోడిని స్టార్ హీరో అయేందుకు దారులు వేసిన సినిమా. ఇక టాలీవుడ్ కి దర్శకధీరుడు అయిన ఎస్ఎస్ రాజమౌళికి అయితే.. ఈ చిత్రంతోనే అరంగేట్రం చేశాడు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రాన్ని జూనియర్ అభిమానులే కాదు.. టాలీవుడ్ బాక్సాఫీస్ కూడా మర్చిపోదు.
అలాంటిది ఎన్టీఆర్ లేకుండా స్టూడెంట్ నెం. 1 మూవీనా అదెలా సంభవం అనుకోవచ్చు కానీ.. ఇప్పుడో కొత్త సినిమా ఇదే టైటిల్ పై మొదలువుతోంది. కృష్ణ చైతన్య అనే కుర్రాడు హీరోగా రవికిరణ్ దర్శకత్వంలో ఈ స్టూడెంట్ నెంబర్ 1 మూవీ రూపొందుతుండగా.. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైపోయింది కూడా. సినిమాలో కీలక పాతర్ పోషించనున్న సీనియర్ నటుడు భానుచందర్.. తొలి క్లాప్ కొట్టాడు.
శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై రూపొందే ఈ చిత్రానికి నిర్మాత కెఎల్ఎన్ ప్రసాద్. భానుప్రియ.. నాజర్.. తాగుబోతు రమేష్.. తనికెళ్ల భరణిలు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. తమ హీరోకి మొదటి బ్లాక్ బస్టర్ అయిన మూవీ టైటిల్.. ఇలా ఓ చిన్న సినిమాకి వెళ్లిపోవడంతో.. జూనియర్ ఫ్యాన్స్ బాగా ఫీలయిపోతున్నారు.