Begin typing your search above and press return to search.
స్టూడియో గ్రీన్ లో భారీ మల్టీస్టారర్
By: Tupaki Desk | 21 April 2019 11:51 AM GMTసౌత్ లో భారీ మల్టీస్టారర్ల ట్రెండ్ అంతకంతకు వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ .. కోలీవుడ్ లోనూ హీట్ మరీ ఎక్కువగా ఉంది. స్టార్ హీరోలు - నవతరం హీరోలు.. సీనియర్లు - జూనియర్ల కలయికతో భారీ బడ్జెట్లు వెచ్చించి మల్టీస్టారర్లు తెరకెక్కించేందుకు మేకర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. వీటికి మార్కెట్ పరంగానూ ఎలాంటి ఇబ్బ ందులు లేకపోవడంతో కలిసొచ్చే వ్యాపారంగానే భావిస్తున్నారు.
తమిళంలో మణరత్నం దర్శకత్వం లో ఇటీవలే నవాబ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మణిరత్న ం తదుపరి ఓ భారీ మల్టీస్టారర్ ని ప్రకటించారు. ఇక ఇదే హుషారులో ప్రఖ్యాత స్టూడియోగ్రీన్ సంస్థ తాజాగా ఓ మల్టీస్టారర్ ని ప్రకటించి వేడి పెంచింది. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. అత్య ంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ చిత్రంలో శింబు- గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా నటించనున్నారు. ఇతరత్రా కాస్టింగ్ వివరాల్ని వెల్లడిస్తామని సదరు సంస్థ ప్రకటించింది. మధన్ కార్తీక్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు.
శింబు సీనియర్ హీరో.. కార్తీక్ నవతరం హీరో. ఆ ఇద్దరినీ కలిపి స్టూడియో గ్రీన్ చేస్తున్న ప్రయత్న ం బావున్నా.. ఇటీవల శింబు ట్రాక్ రికార్డ్ దృష్ట్యా మార్కెట్ పరంగా ఏ మేరకు వర్కవుట్ అవుతుంది? అన్న ఆసక్తికర చర్చ మొదలైంది. వాస్తవానికి గత ఏడాది `నోటా` రిలీజ్ టైమ్ లో స్టార్ హీరో సూర్య - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించేందుకు స్టూడియో గ్రీన్ సంస్థ ప్లాన్ చేసిందని ప్రచారమైంది. కానీ ఆ తర్వాత దానికి సంబంధించిన అప్ డేట్ లేదు. ఇప్పుడు శింబు - కార్తీక్ కాంబినేషన్ తో రీప్లేస్ చేసి సెట్స్ కెళుతున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు స్టూడియో గ్రీన్ సంస్థ విశాల్ హీరోగా ఆయోగ్య.. ఆర్య హీరోగా టెడ్డీ అనే చిత్రాల్ని నిర్మిస్తోంది.