Begin typing your search above and press return to search.
సూర్యతో దేవరకొండ మల్టీస్టారర్?
By: Tupaki Desk | 1 Oct 2018 9:41 AM GMTతమిళంలో మార్కెట్ సంపాదించుకోవాలని తెలుగు స్టార్ హీరోలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మహేష్ బాబు లాంటి స్టార్ సైతం అక్కడ ‘స్పైడర్’ లాంటి భారీ ద్విభాషా చిత్రం చేశాడు కానీ.. ఫలితం దక్కలేదు. ఐతే కెరీర్ ఆరంభించిన కొన్నేళ్లకే విజయ్ దేవరకొండ ‘నోటా’ను రెండు భాషల్లో చేశాడు. తమిళంలో ఈ చిత్రానికి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఈ నెల 5న భారీ అంచనాల మధ్య రెండు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘అర్జున్ రెడ్డి’ తెలుగు వెర్షన్ తోనే విజయ్ కి తమిళనాట మంచి క్రేజ్ వచ్చింది. రెండు మూడు సందర్భాల్లో అతను చెన్నైకి వెళ్తే అక్కడ రెస్పాన్స్ మామూలుగా లేదు. ‘నోటా’ ప్రమోషన్లలో కూడా అతడిని బాగా రిసీవ్ చేసుకున్నారు. ‘నోటా’ కనుక హిట్టయితే విజయ్ కి అక్కడ మంచి మార్కెట్ వచ్చే అవకాశముంది.
విశేషం ఏంటంటే.. ఈ చిత్రం విడుదల కాకముందే విజయ్.. ఓ తమిళ స్టార్ హీరోను కలిపి మల్టీస్టారర్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని విజయే స్వయంగా వెల్లడించాడు. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్యతో తాను మల్టీస్టారర్ చేసే అవకాశాలున్నట్లు అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నోటా’ విడుదల తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందన్నాడు. వరుస హిట్లతో బాగా మార్కెట్ పెరిగిన నేపథ్యంలో పారితోషకం చాలా పెంచేశారట కదా అని విజయ్ ని అడిగితే.. అలాంటిదేమీ లేదన్నాడు. ప్రతి సినిమాకూ ఇదే మన చివరి సినిమా అన్నట్లుగా పని చేసుకుంటూ పోతున్నానని.. పారితోషకం ఏమీ విపరీతంగా పెంచేయలేదని.. తాను ఇంకా స్టార్ డమ్ కి సింక్ కాలేదని విజయ్ అన్నాడు. సినిమా సినిమాకూ రెమ్యూనరేషన్ హైక్ గురించి ఆలోచిస్తూ తాను పని చేయనన్నాడు. అనామక స్థాయి నుంచి మంచి గుర్తింపు పొందే స్థాయికి చేరుకున్నానని.. అదే తనకు చాలా సంతోషాన్నిచ్చే విషయమని.. అంతే తప్ప స్టార్ డమ్ గురించి ఆలోచించనని అతను స్పష్టం చేశాడు.