Begin typing your search above and press return to search.

46 వ‌య‌సులో స్ట‌న్నింగ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Nov 2019 4:52 AM GMT
46 వ‌య‌సులో స్ట‌న్నింగ్ బ్యూటీ
X
జిమ్ - యోగా అంటే గుర్తు కు రావాల్సిన మొద‌టి పేరు మ‌లైకా అరోరా ఖాన్. శిల్పా శెట్టి కి క‌జిన్ సిస్ట‌ర్ లా మ‌లైకా త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. త‌నో రెగ్యుల‌ర్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగ‌తి తెలిసిందే. జిమ్ కి వెళ్ల‌నిదే.. యోగా చెయ్య‌నిదే అస‌లు కంటి కి కునుక‌న్నదే ప‌ట్ట‌దు. ప్ర‌తి రోజూ ముంబై బాంద్రా జిమ్ముల్లో మ‌లైకా హార్డ్ వ‌ర్క్ కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి...! ఈ 46 ఏజ్ మ‌లైకా తాజా గా మ‌రోసారి జిమ్ నుంచి వ‌స్తూ ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది.

జిమ్ యోగా సెష‌న్స్ అనంత‌రం మ‌లైకా ముంబై బాంద్రాలో సెల‌బ్రిటీ జిమ్ నుంచి వ‌స్తూ ఇలా క‌నిపించింది. రీబాక్ బ్రాండెడ్ స్పోర్ట్స్ డ్రెస్ లో త‌ళుక్కుమంది. కాస్త లూజ్ టాప్ తో క‌నిపించినా.. బాట‌మ్ లో టైట్ షార్ట్ తో ప్ర‌త్య‌క్ష‌మైంది.పెర్ఫెక్ట్ టోన్డ్ అందంతో ఈ అమ్మ‌డు అదిరే ట్రీటిచ్చింది. మ‌స్తీ సినిమా లో ఇచ్చిన ట్రీట్ ఇది అంటూ యూత్ దీని పై ముచ్చ‌ట్లాడ‌డం విశేషం.

ఛ‌య్యా ఛ‌య్యా ఛ‌య్యా! (దిల్ సే- 1998) అంటూ రెండు ద‌శాబ్ధాల క్రితం తెలుగు ఆడియెన్ కి అదిరే ట్రీటిచ్చిన గ్రేట్ డ్యాన్స‌ర్ కం మోడ‌ల్ మ‌లైకా 2012లో ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ లో ఐటెమ్ నంబ‌ర్ లో న‌ర్తించింది. కెవ్వు కేక అంటూ ఇచ్చిన ట్రీట్ ని ఇంకా యూత్ మ‌ర్చి పోనే లేదు. ప్ర‌స్తుతం సినిమాలు చేస్తున్న‌దేం లేదు. ఐటెమ్ నంబ‌ర్లు కూడా త‌గ్గాయి. అయితే ప్ర‌స్తుతం మ‌లైకా క్రేజ్ చూస్తుంటే మ‌రోసారి పిలిచి ఛాన్సివ్వ‌డం గ్యారెంటీ.