Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: గ్రేజియా కవర్ పై స్టన్నింగ్ బ్యూటీ
By: Tupaki Desk | 1 Aug 2019 9:28 AM GMTబాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ పేరు గతంలో హిందీ సినిమాలు చూసేవారికి.. బాలీవుడ్ న్యూస్ ఫాలో అయ్యే తెలుగు ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ ప్రభాస్ 'సాహో' పుణ్యమా అని ఇప్పుడు తెలుగు ఆడియన్స్ లో శ్రద్ధ పేరు పాపులర్ అయింది. సినిమా కనుక హిట్ అయితే శ్రద్ధకు తెలుగులో మరింతగా గుర్తింపు రావడం ఖాయం. ఇదిలా ఉంటే శ్రద్ధ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది.
తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా శ్రద్ధ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు "గ్రేజియా ఇండియా కోసం.. ఫోటో తీసినవారు రోహన్ శ్రేష్ఠ" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ లో సెకండ్ పార్ట్ అర్థం అయింది కదా ? రోహన్ శ్రేష్ఠ ఎవరు అంటే శ్రద్ధ చిన్ననాటి స్నేహితుడు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఈ రోహన్ తోనే శ్రద్ధ డీప్ లవ్ లో ఉందని.. త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోబోతున్నారాని బాలీవుడ్ మీడియా జోరుగా కథనాలు వండి వారుస్తోంది. ఇక క్యాప్షన్ లో ఫస్ట్ హాఫ్.. గ్రేజియా ఇండియా ఆగష్టు ఎడిషన్ కవర్ పేజి కోసం ఈ ఫోటో తీయడం జరిగింది.
ఫోటోలో శ్రద్ధ పోల్కా డాట్స్ ఉండే రెడ్ కలర్ గౌన్ ధరించి స్టైల్ గా ఒక సోఫాలో కూర్చుంది. ఒక చేతిని దిండుపై పెట్టి మరో చేత్తో తన శిరోజాలను సవరించుకుంటూ ఒక ఘాటు ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. గ్రేజియా మ్యాగజైన్ లో 'ఇన్ ది స్పాట్ లైట్.. శ్రద్ధా కపూర్' పేరుతో ఒక కథనం కూడా ప్రచురించారు. నిజమే.. 'సాహో' రిలీజ్ కు ముందు శ్రద్ధ స్పాట్ లైట్ లో ఉండడం ఆశ్చర్యం ఏముంది? ఇక ఈ ఫోటోకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "రెడ్ డ్రెస్ లో స్టన్నింగ్ గా ఉన్నావు".. "వావ్.. సో బ్యూటిఫుల్".. "కూల్ పిక్.. ఆర్టిస్టిక్ బాయ్ ఫ్రెండ్" అంటూ కామెంట్లు పెట్టారు. శ్రద్ధ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'సాహో' ఈ నెలలలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా 'చిచోరే'.. 'స్ట్రీట్ డ్యాన్సర్' చిత్రాలలో కూడా నటిస్తోంది.