Begin typing your search above and press return to search.

ఒంపుసొంపుల బాడీ వెనుక కష్టం చూశారా

By:  Tupaki Desk   |   20 Nov 2017 10:43 AM GMT
ఒంపుసొంపుల బాడీ వెనుక కష్టం చూశారా
X
చాలామంది హీరోయిన్లను చూడగానే.. అబ్బా ఎంత హాటుగా ఉన్నారో అనకుండా ఉండలేం. 40+ ఏళ్ళ మలైకా అరోరా అయినా.. 30+ ఏళ్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అయినా.. 25+ ఏళ్ళ దిశా పటాని అయినా కూడా.. చూడగానే రూప లావణ్యంతో పడేస్తారు. అసలు వీరికి ఇన్నేసి ఒంపుసొంపులు ఎలా సాధ్యం అనుకుంటూ మనం ముక్కున వేలేసుకోవాల్సిందే. మరో ప్రక్కన ఆలియా భట్ అండ్ సోనమ్ కపూర్ వంటి బ్యూటీలు అందంగానే ఉన్నా కూడా.. ఈ రేంజు ఒంపుసొంపులు మాత్రం లేవు.

దానికి కారణం ఒక్కటే. ఈ వయ్యారి భామలంతరూ ఖాళీగా ఉన్నప్పుడు దాదాపు రోజంతా జిమ్ లోనే గడిపేస్తారు. పైగా ఏదో జిమ్ కు వచ్చాం అంటే వచ్చాం అన్నట్లు కాకుండా అక్కడ ఒళ్ళు నలిగిపోయేలా వ్యాయామాలూ గట్రా చేస్తుంటారు. కాస్త యోగాతో కూడా ఫోజుల్లో నుంచుని.. మనకు పిచ్చెక్కిస్తారు. అదిగో అక్కడ దిశా పటానీ చూడండి.. అసలు అలాంటి ఫీట్లు చేయాలంటే మామూలుగా జిమ్ కు వెళ్ళే వారికి సాధ్యపడుతుందా? స్లిమ్ గా ఉంటే సరిపోదు.. బాగా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటేనే అలా ఆసనాలు వేయగలుగుతం. అంటే దిశా ఒంపుసొంపులన్నీ ఏదో సరదాగా అలా వచ్చేసినవి కావు.. ఒళ్లు హూనం చేసుకుంటేనే వచ్చాయి.

మామూలుగా ఈ ఫోటోలు చేసి మెలికలు తిరిగిపోయే గ్లామర్ లవ్వర్లందరూ.. ఇలాంటి మెలికలు తిరగడం అంత ఈజీగా అయ్యే పని కాదని అంటున్నారు. అది సంగతి.