Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ మూవీలో ఆ తరహా ఫైట్స్ ఉండవట
By: Tupaki Desk | 8 Aug 2020 5:45 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ తాజా చిత్రం ‘మాస్టర్’. అన్ని సవ్యంగా ఉండి ఉంటే సమ్మర్ లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కాని కరోనా కారణంగా సినిమా ఆగిపోయింది. ఈ ఏడాది వచ్చేది లేనిది క్లారిటీ లేదు. గత రెండు మూడు సంవత్సరాలుగా విజయ్ చేసిన ప్రతి సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ముఖ్యంగా చివరి నాలుగు అయిదు సినిమాలు వందల కోట్ల వసూళ్లు రాబట్టి సౌత్ ఇండియాలోనే ఆయన్ను టాప్ గా నిలిపాయి. ఇప్పుడు మాస్టర్ కూడా ఖచ్చితంగా 300 కోట్ల నుండి 400 కోట్ల వరకు వసూళ్లు చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమాకు స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించిన సిల్వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మాస్టర్’ చిత్రం స్టంట్ మాస్టర్ సిల్వ ఇటీవల ఒకానొక సందర్బంగా మాట్లాడుతూ.. మాస్టర్ సినిమాలో ఆరు ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా నేచురల్ గా ఉంటాయి. భారీ యాక్షన్ సీన్స్ కాకుండా చాలా మందిని కొట్టడం దూరాన పడటం వంటివి కాకుండా చాలా సహజంగా సీన్స్ ఉండాలని దర్శకుడు సూచించాడు. అందుకే చాలా సింపుల్ గా ఆకట్టుకునే విధంగా యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేసినట్లుగా చెప్పాడు. విజయ్ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా విభిన్నంగా ఉంటాయంటూ ఆయన పేర్కొన్నాడు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న కారణంగా అంచనాలు మరింతగా పెరిగాయి.