Begin typing your search above and press return to search.
స్టైల్ స్టేట్ మెంట్ షాకిస్తోంది మ్యాడమ్
By: Tupaki Desk | 8 Dec 2022 3:29 AM GMTబాలీవుడ్ లో ఒకరితో ఒకరు పోటీపుడుతూ స్టైల్ కా బాప్ ఫ్యాషనిస్టాలుగా యువనాయికలు వెలిగిపోతున్నారు. జాన్వీ కపూర్- సారా అలీఖాన్- అనన్య పాండే - కియరా అద్వాణీ- పూజాహెగ్డే లాంటి స్టైలిష్ బ్యూటీస్ తో పోటీ పడి పందెంలో నెగ్గాలంటే కేవలం ప్రతిభ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ సెన్స్ టైమింగ్ సెన్స్ తో పాటు ఇంకా చాలా కావాలి. చివరిగా లక్ కూడా ఫేవర్ చేయాలి.
అయితే బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆరంభ దశలోనే వీటన్నిటినీ సమర్థంగా స్టడీ చేస్తోంది రష్మిక మందన్న. తాజాగా రష్మిక షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ చూశాక స్టైల్ ఫ్యాషనిస్టాలు... ఐకాన్ లకే చెమటలు పట్టించేస్తోంది...! అంటూ శ్రీవల్లి (పుష్ప) అభిమానులు మురిసిపోతున్నారు. ఒక గిరిజన పల్లెటూరు యువతి శ్రీవల్లిగా ముతక వస్త్రాల్లో సాధాసీదాగా కనిపించి ఎంతో గొప్పగా నటించి మెప్పించిన రష్మికలో ఈ ఫ్యాషన్ వైవిధ్యం మనసులపై ఘాడమైన ముద్ర వేస్తోంది. ఆమె మన శ్రీవల్లేనా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతగా ఇటీవలి కాలంలో తన ఫ్యాషన్ గేమ్ ని రష్మిక ఛేంజ్ చేస్తోంది.
రష్మిక మందన్న లేటెస్ట్ గా ఆకర్షణీయమైన రెడ్ ప్యాంట్ సూట్ లుక్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యాషన్ సెన్స్ పరంగా.. క్లాసిక్ ఎలివేషన్ తో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. స్టైల్ స్టేట్ మెంట్ లో తగ్గేదేలే అని నిరూపిస్తోంది. మిడ్డీ డ్రెస్ లు- షరారా సెట్ ల నుండి కో-ఆర్డ్స్ వరకు- రష్మిక మందన్న వెరైటీ డిజైనర్ లుక్స్ తో కట్టి పడేస్తోంది.
తన ఎరుపు రంగు ప్యాంట్‌సూట్‌ను నీలిరంగు హీల్స్ తో స్పెషల్ గా కనిపించింది. సెమీ-స్మడ్జ్డ్ ఐలైనర్- న్యూడ్ లిప్స్- గిరజాల జుట్టుతో తన రూపానికి కొత్త మెరుగులు అద్దింది. మినీ హూప్ చెవిపోగులతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.
మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి హిందీ తొలి చిత్రం గుడ్ బైలో రష్మిక మందన్న చివరిసారిగా కనిపించింది. స్టన్నర్ అనిపించే ఆసక్తికరమైన సినిమాలతో కెరీర్ లైనప్ అద్భుతంగా ఉంది. దళపతి విజయ్ సరసన వారసుడులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో నటిస్తోంది. హిందీ చిత్రం 'మిషన్ మజ్ను'లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఈ భామ నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.