Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : పాయల్‌ స్టైలిష్ హాట్ లుక్‌ అదుర్స్‌

By:  Tupaki Desk   |   2 Aug 2022 3:30 AM GMT
ఫోటోటాక్ : పాయల్‌ స్టైలిష్ హాట్ లుక్‌ అదుర్స్‌
X
ఆర్‌ఎక్స్ 100 సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌. మొదటి సినిమా లోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా.. అది కాకుండా ఒక బోల్డ్‌ పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయడం ద్వారా ఒక్కసారి గా టాలీవుడ్‌ లో ఆమె గురించిన చర్చ మొదలు అయ్యింది.

హీరోయిన్‌ గా ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. కమర్షియల్‌ హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడం వల్లనో లేదా మరేంటో కాని స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు మాత్రం రాలేదు. అయినా కూడా నిరుత్సాహపడకుండా వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తోంది.

సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ఇన్‌ స్టా గ్రామ్‌ లో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు మరియు వీడియోలు ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన పాయల్‌ రాజ్ పూత్‌ మరోసారి అందాల ఆరబోత విషయం లో అందరిని దాటేసింది.. దాటేస్తుంది అన్నట్లుగా అభిమానులతో కామెంట్స్ ను దక్కించుకుంది.

సింపుల్‌ వైట్ టాప్ అండ్‌ బ్లాక్ స్కర్ట్‌ లో ఆన్‌ మై వే టు యూ అంటూ షూటింగ్‌ కు వెళ్తున్నట్లుగా కామెంట్‌ పెట్టింది. షూటింగ్ కోసం చాలా స్టైలిష్ గా హాట్ లుక్ తో రెడీ అయ్యింది.

ఆమె ఔట్ ఫిట్ కూడా చాలా బాగుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్ పూత్‌ మరోసారి ఈ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.