Begin typing your search above and press return to search.
స్టైలిష్ స్టార్ మాస్టర్ ప్లాన్స్ పై మహమ్మారీ పంచ్!
By: Tupaki Desk | 18 Jun 2020 7:10 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరికి వారు పాన్ ఇండియా స్టార్లుగా రాణించాలని ఆశపడుతున్నారు. బాహుబలి - సాహో చిత్రాలతో ప్రభాస్ సౌత్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత ప్రభాస్ ని ఇంచి కదపాలన్నా ఇతర స్టార్లకు కష్టంగానే ఉంది. ఆ క్రమంలోనే చరణ్.. ఎన్టీఆర్.. అల్లు అర్జున్ .. మహేష్ వీళ్లంతా పాన్ ఇండియా ప్రయత్నాల్లో వేగం పెంచారు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైపు నుంచి ఈ ప్రయత్నం సీరియస్ గానే ఉంది. కనీసం సౌత్ బెస్ట్ స్టార్ గా వెలగాలన్నది బన్నీ ప్లాన్. ఆ క్రమంలో ఎంచుకున్నదే `పుష్ప`.
నిజానికి బన్ని `అలవైకుంఠపురం` సినిమాతో మొత్తం నాన్ బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసేశాడు. ఇదే ఊపుతో బన్ని వేసిన ప్లాన్స్ వింటే కాస్త షాకింగ్ గానే అనిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా.. సథరన్ స్టార్ గా ఎదగడానికి బన్ని పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కన్నడ.. మలయాళం మార్కెట్లలో బన్నికి బాగానే ఫాలోయింగ్ ఉంది కానీ తమిళ తంబీలు మాత్రం బన్నిని ఆదరించడంలేదు. అందుకే బన్ని రగ్గ్ డ్ నేటివిటీ మాస్ స్టోరీతో `పుష్ప`కు ఒప్పుకున్నాడు. ఈ సినిమాని కాస్త తమిళ నెటివిటీకి దగ్గరగా ఉంటుంది. అంతే కాదు ఈ సినిమా కనీసం యావరేజ్ టాక్ వచ్చినా నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కొరటాలతో.. ఆ తరువాత రాజమౌళితో.. అటుపై తిరిగి త్రివిక్రమ్ తో సినిమాలు చేయడానికి బన్ని ప్లాన్ చేసుకున్నాడు.
అయితే `పుష్ప`తో అనుకున్నది సాధిస్తాడా? అంటే ఇప్పుడు డౌటే. పైగా సుకుమార్ మేకింగ్ స్టైల్ కి పుష్ప కోసం భారీగా ఖర్చు చేయాలి. కరోనా రాకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్ బన్ని ప్లాన్స్ అంతా సజావుగా సాగేవి. కానీ ఇప్పుడు పుష్ప షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్నది ఇంతవరకు ఎవ్వరికి క్లారిటీ లేదు. స్టార్ట్ అయినా ఎంత పెట్టుబడి పెడతారు.. బడ్జెట్ పెంచినా వర్కవుటవుతుందా? అసలు మార్కెట్ ఎలా చేస్తారు ఇలా రకరకాల డౌట్స్ కొడుతున్నాయి. ఏదేమైనా కరోనా కి వ్యాక్సిన్ వస్తే మాత్రం బన్నీ ప్లాన్స్ యాజ్ టీజ్ గా ఉంటాయి.. లేకపోతే ఇక లేనట్లేనని గుసగుసలు వినిపిస్తున్నాయ్. పాన్ ఇండియా కలలు గనే అందరు స్టార్లకు ఇప్పుడు ఇదే పరిస్థితి.