Begin typing your search above and press return to search.

బన్నీ నెక్ట్స్ లెవల్ ఎప్పుడు?

By:  Tupaki Desk   |   8 April 2019 5:23 AM GMT
బన్నీ నెక్ట్స్ లెవల్ ఎప్పుడు?
X
స్టైల్ అన్న పదానికి నిర్వచనం అల్లు అర్జున్. అందుకే అతడిని స్టైలిష్ స్టార్ అని ఫిక్స్ చేశారు ఫ్యాన్స్. బన్ని డ్యాన్సులకు ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. అతడిలోని ఎనర్జీ.. స్టైల్ కంటెంట్ కి ప్రత్యేకించి ఐడెంటిటీ ఉంది. ఇండియా బెస్ట్ డ్యాన్సర్లలో కచ్ఛితంగా అల్లూ వారబ్బాయ్ బన్ని పేరు ఉండి తీరాల్సిందే. అంతటి ప్రతిభావంతుడు కాబట్టే సౌత్ లో ఏ ఇతర స్టార్ కి లేనంత మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉన్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల వరకే అతడి క్రేజు పరిమితమా? అనుకుంటే.. అల్లు అర్జున్ అన్న పేరు వింటే సునామీ లా ఉరకలెత్తే ఫ్యాన్స్ మలయాళంలోనూ ఉన్నారు. ఖండాంతరాల్లో అభిమాన సంఘాలు ఉన్నాయి. అందుకే బన్ని నటించే సినిమా హిట్టు అన్న టాక్ వస్తే తాజా సన్నివేశంలో 80 నుంచి 100కోట్ల క్లబ్ లో చేరడం కష్టమేమీ కాదు.

కెరీర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ లో నటించాడు బన్ని. ఆర్య, దేశముదురు, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం చిత్రాలు బంపర్ హిట్లు కొట్టాయి. ఆర్య 2, డీజే చిత్రాలు అతడికి అభిమానుల్లో పాపులారిటీని తెచ్చాయి. కెరీర్ లో నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు దక్కాయి. ఆర్య, పరుగు చిత్రాలకు నంది జూరీ అవార్డులు దక్కాయి. ప్రస్తుతం ఏఏ19, ఏఏ20, ఏఏ21 వరుసగా క్యూలో ఉన్నాయి. వీటిలో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లే సినిమాలేవీ? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏఏ 19 .. సుకుమార్ దర్శకత్వంలో ఏఏ 20.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఏఏ 21 వరుసగా తెరకెక్కుతున్నాయి. ఇవన్నీ బన్నిని నెక్ట్స్ లెవల్లో ఆవిష్కరిస్తాయనే అభిమానులు భావిస్తున్నారు.

బన్ని.. త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు గుర్తుకు వస్తాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలు అవి. ఫ్యామిలీ ఆడియెన్ ని థియేటర్లకు రప్పించగలిగారు. అందుకే ఆ సినిమాల్ని మించిన హిట్ కొట్టాల్సిన సన్నివేశం ఉంది. కారణం ఏదైనా త్రివిక్రమ్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఆర్య, ఆర్య 2 లాంటి గమ్మత్తయిన చిత్రాలతో ప్రత్యేకించి ఫ్యాన్ పాలోయింగ్ తెచ్చుకున్నారు బన్ని.. సుక్కూ జోడీ. అందుకే ఇప్పుడు ఏఏ 20పైనా అంతే భారీ అంచనాలేర్పడ్డాయి. ఆ స్థాయిని అందుకునే ప్రాజెక్టుతోనే ఈ జోడీ సెట్స్ కెళుతుందనే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో ఉన్నారు. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకన్ అనే టైటిల్ ని ప్రకటించి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు దిల్ రాజు. ఈ మూడు సినిమాలు బన్ని కెరీర్ కి ఎంతో ఇంపార్టెంట్. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న బన్నికి తుపాకి తరపున శుభాకాంక్షలు.