Begin typing your search above and press return to search.
స్టైలిష్ స్టార్ వర్సెస్ మ్యాడీ.. వ్వాటే జంబో కాంబో!
By: Tupaki Desk | 27 Sep 2020 7:50 AM GMTఈ ఏడాది `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ఆనందంలో వున్న అల్లు అర్జున్ వెంటనే పాన్ ఇండియా స్థాయిలో `పుష్ప` చిత్రాన్ని మొదలుపెట్టాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరపైకి వచ్చింది. ఆర్య - ఆర్య 2 చిత్రాల తరువాత మూడవ సారి వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
పైగా ఇందులో బన్నీ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ పాత్రలో లారీ డ్రైవర్ గా... ఎర్రచందనం చెక్కల స్మగ్లర్ గా రగ్గ్ డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. పుష్పరాజ్ పాత్రలో ఊర మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తున్న స్టిల్స్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో విజయ్ సేతుపతి కీ రోల్ లో కనిపించాల్సింది. కొన్ని కారణావల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ పాత్రలో ఎవరిని తీసుకోవాలా అని గత కొన్ని రోజులుగా తర్జన భర్జన పడుతున్న టీమ్ మొత్తానికి ఆ పాత్ర కోసం మాధవన్ ని ఎంపిక చేసినట్టు తెలిసింది. ఫారెస్ట్ ఆఫీసర్ గా మాధవన్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. నవంబర్ 20 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారట. హైదరాబాద్ శివారులో ఈ మూవీ కోసం సెట్స్ వేస్తున్నారు. అన్నీ పూర్తయితే నవంబర్ 20 నుంచి `పుష్ప` పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.