Begin typing your search above and press return to search.
సుబ్బరాజు ఉక్కిరి బిక్కిరి!
By: Tupaki Desk | 21 July 2017 4:53 PM GMTటాలీవుడ్ డ్రగ్ రాకెట్ కేసును విచారిస్తున్న సిట్ బృందం శుక్రవారం క్యారెక్టర్ నటుడు సుబ్బరాజుకు చుక్కలు చూపించినట్లు సమాచారం. తొలి రెండు రోజులు పూరి జగన్నాథ్.. శ్యామ్ కె.నాయుడులను విచారించిన సిట్ అధికారులు.. మూడో రోజైన శుక్రవారం సుబ్బరాజును విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. మిగతా ఇద్దర్లాగే సుబ్బరాజును కూడా అధికారులు కొంచెం ఎక్కువ సమయమే విచారించారు. దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సుబ్బరాజును విచారించినట్లు సమాచారం.
కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తో సుబ్బరాజుకున్న సంబంధాలపై అధికారులు ఆరా తీశారని.. సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. అధికారుల ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు సుబ్బరాజు ఇబ్బంది పడినట్లుగా సమాచారం. పూరి, శ్యామ్ లను వేర్వేరు బృందాలు విచారించగా.. మరో బృందం సుబ్బరాజును ప్రశ్నించింది. సుబ్బరాజు ఉదయం చెప్పిన దానికి.. మధ్యాహ్నం చెప్పిన దానికి సంబంధం లేకపోవడంతో అధికారులకు అతడి తీరు అనుమానాస్పదంగా అనిపించినట్లు సిట్ వర్గాలు చెబుతున్నాయి.!
ఓ దశలో విచారణ ముగిసి.. సుబ్బరాజు కిందికి దిగుతుండగా మళ్లీ అధికారులు వెనక్కి పిలవగా.. అకున్ సబర్వాల్ రంగంలోకి దిగిన విచారించినట్లు సమాచారం. సిట్ బృందం బ్లడ్ శాంపిల్ ను కూడా సేకరించింది. విచారణకు అందరూ సహకరిస్తున్నారని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. శనివారం నటుడు తరుణ్ విచారణకు హాజరు కానున్నారని తెలిపారు.